పెట్టుబడుల సమీకరణలో మరో అడుగు ముందుకు - ఒబెన్‌ ఎలెక్ట్రిక్‌

1 Jul, 2023 07:08 IST|Sakshi

బెంగళూరు: దేశీ విద్యుత్‌ వాహనాల తయారీ సంస్థ ఒబెన్‌ ఎలెక్ట్రిక్‌ కొత్తగా రూ. 40 కోట్ల పెట్టుబడులు సమీకరించింది. స్ట్రైడ్‌ వెంచర్స్, ఇండియన్‌ రెన్యువబుల్‌ డెవలప్‌మెంట్‌ ఏజెన్సీ, ముంబై ఏంజెల్స్‌ తదితర సంస్థలు ఇన్వెస్ట్‌ చేసినట్లు ఒబెన్‌ సీఈవో మధుమిత అగర్వాల్‌ తెలిపారు. ఎక్స్‌టెండెడ్‌ ప్రీ–సిరీస్‌ ఏ రౌండ్‌ కింద ఈ నిధులను సమీకరించినట్లు చెప్పారు. దీంతో ప్రీ–సిరీస్‌ కింద మొత్తం రూ. 72 కోట్ల పెట్టుబడులు సాధించినట్లయిందని వివరించారు. 

కొత్తగా ఆవిష్కరించిన తమ తొలి ఎలక్ట్రిక్‌ బైక్‌ రోర్‌ డెలివరీలను ప్రారంభించేందుకు, ఉత్పత్తిని వార్షికంగా లక్ష యూ నిట్లకు పెంచుకునేందుకు ఈ నిధులను ఉప యోగించుకోనున్నట్లు చెప్పారు. జూలై మొద టివారం నుంచి బెంగళూరులో డెలివరీలు ప్రారంభమవుతాయని అగర్వాల్‌ తెలిపారు.

>
మరిన్ని వార్తలు