ఫెస్టివ్ సీజన్ : త్వరలో ఐఫోన్12 

29 Sep, 2020 14:34 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కొత్త ఐఫోన్ కోసం ఐఫోన్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నతరుణంలో మార్కెట్లో అనేక ఊహాగానాలు  హల్ చల్ చేస్తున్నాయి. ఎప్పటినుంచో ఎపుడెపుడా అని ఊరిస్తున్నయాపిల్  ఐఫోన్12 ఆవిష్కారానికి రంగం సిద్ధమవుతోంది. యాపిల్ తన రాబోయే స్మార్ట్ ఫోన్ ఐఫోన్ 12 త్వరలోనే లాంచ్ చేయనుందంటూ  పుకార్లు షికార్లు చేస్తున్నాయి. యాపిల్ లాంచ్ ఈవెంట్‌ను అక్టోబర్ 13 న నిర్వహించనుందని, ఈ సందర్భంగానే దీన్ని ఆవిష్కరించనుందని తాజా  రిపోర్టుల ద్వారా తెలుస్తోంది.  రానున్న పండుగ సీజన్ నేపథ్యంలో భారతీయ వినియోగదారులకు ఐఫోన్ సిరీస్ లో భాగంగా  కొత్త ఐఫోన్12 మినీ, ఐఫోన్12 రెండు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకురానుంది.  (యాపిల్‌ ఆన్‌లైన్‌ స్టోర్‌ : బంపర్ ఆఫర్లు)

ప్రస్తుతానికి కొత్త ఐఫోన్ కోసం ప్రణాళికలను  యాపిల్ ధృవీకరించలేదు. సాధారణంగా యాపిల్ తన ఫోన్ లాంచ్ ఈవెంట్‌ను సెప్టెంబర్‌లో నిర్వహిస్తుంది. అయితే  కోవిడ్-19, లాక్‌డౌన్  ఆంక్షల  నేపథ్యంలో ఇటీవల వర్చువల్ గా  నిర్వహించిన గ్లోబల్ ఈవెంట్ లో యాపిల్ వాచ్ సిరీస్, ఐపాడ్ లాంటి ఉత్పత్తులను లాంచ్ చేసింది.  ఈ సందర్భంగా యాపిల్ ఐఫోన్ 12 పై  ఒక ప్రకటన ఉంటుందని ఆశించిన వారికి నిరాశే మిగిలింది.  ఐఫోన్ లాంచ్ గురించి యూట్యూబర్ జోన్ తాజా సమాచారం ఐఫోన్ 12 లాంచ్ కార్యక్రమం అక్టోబర్‌లో జరగనుంది.  మూడు రెగ్యులర్ వేరియంట్లలో తీసుకురానుంది.  అంతేకాదు అక్టోబర్ 16 నుండి ప్రీ ఆర్డర్‌లను ప్రారంభించవచ్చట. 6.1 అంగుళాల స్క్రీన్  256వరకు స్టోరేజ్ ,  5.4 అంగుళాలు 64జీబీ స్టోరేజ్ తో రానుంది. 256 జీబీ స్టోరేజ్ ఆప్షన్  ఏ14 బయోనిక్ ప్రాసెసర్  తో రూపొందిస్తున్న  ఐఫోన్ 12 ప్రో,   ప్రో మాక్స్ స్క్రీన్ పరిమాణాలు వరుసగా 6.1 అంగుళాలు,  6.7 అంగుళాలుగా ఉండవచ్చని మరో అంచనా. 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు