75 వేలకోట్ల పెట్టుబడులు, 24వేల జాబ్స్‌ , బిగ్‌ ఇన్వెస్టర్‌గా అదానీ

11 Aug, 2022 14:02 IST|Sakshi

భువనేశ్వర్‌: ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ రూ.74,620 కోట్ల విలువైన 10 ప్రాజెక్టులకు అనుమతి ఇచ్చారు. మేకిన్‌ ఒడిశా చొరవలో భాగంగా వీటికి ఒడిశా ప్రభుత్వం అనుమతినిచ్చింది. ఈ ప్రాజెక్టుల వల్ల రాష్ట్రంలో 24వేలమందికి పైగా ఉపాధి లభిస్తుందని అంచనా. ఒడిశా ప్రభుత్వం ఆమోదించిన 10 పారిశ్రామిక ప్రాజెక్టులలో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా, మెటల్, ఇతర మౌలిక సదుపాయాల ప్రాజెక్టులున్నాయి. అలాగే టాటా గ్రూప్, అదానీ గ్రూప్ , ఆర్సెలార్‌ మిట్టల్ నిప్పన్ స్టీల్ పెద్ద పెట్టుబడిదారులుగా ఉన్నాయి. (Moto G62 5G:మోటో కొత్త  5జీ స్మార్ట్‌ఫోన్‌, స్పెషల్‌  ఎట్రాక్షన్‌ ఏంటంటే?)

బిగ్‌ ఇన్వెస్టర్‌గా అదానీ
7,750 మందికి ఉపాధి అవకాశాలను కల్పించే రూ. 41,653 కోట్ల పెట్టుబడితో కాశీపూర్‌లో 4.0 MTPA అల్యూమినా రిఫైనరీ, 175 MW CPP ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలన్న అదానీ ఎంటర్‌ప్రైజెస్ ప్రతిపాదనను కమిటీ ఆమోదించింది.

టాటా స్టీల్‌
పారాదీప్‌లో రూ.2,000 కోట్ల పెట్టుబడితో గ్రీన్ హైడ్రోజన్ (20 కేటీపీఏ), గ్రీన్ అమ్మోనియా (100 కేటీపీఏ) ప్లాంట్ల ఏర్పాటు ప్రతిపాదనకు కమిటీ ఆమోదం తెలిపింది. ఈ ప్లాంట్ల వల్ల 2,000 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఈ ప్లాంట్లు రాష్ట్రంలోని ఉక్కు, ఎరువుల రంగాల డిమాండ్‌ను తీర్చడంతో పాటు పర్యావరణంపై కూడా సానుకూల ప్రభావం చూపుతాయని  ఒడిశా సర్కార్‌ ప్రకటించింది. "విజన్ 2030’’ కి ఊతమిచ్చేలా  మెటల్ సెక్టార్‌లో డౌన్‌స్ట్రీమ్ యూనిట్ల అభివృద్ధికి ప్రోత్సాహాన్నిస్తున్నట్టు తెలిపింది. వెయ్యి కోట్ల పెట్టుబడితో 60,000 MT పారిశ్రామిక నిర్మాణం, 6,000 MT స్టీల్ ప్లాంట్ పరికరాల సౌకర్యాల ఏర్పాటుకు టాటా స్టీల్ ఆమోదం పొందింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా 2,451 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. జగత్‌సింగ్‌పూర్, రాయగడ, జాజ్‌పూర్, భద్రక్, కెందుఝర్, కటక్ , మయూర్‌భంజ్‌లలో ఈ ప్రాజెక్టులు అమలు కానున్నాయి. 

కళింగలో 2.5 MTPA స్టీల్ ప్లాంట్, 370 MW CPP ప్లాంట్‌ను కూడా ఒరిస్సా అల్లాయ్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్ రూ. 8,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసి 5,000 మందికి ఉపాధి అవకాశాలను కల్పిస్తుంది .డాల్కీలో 6 MTPA బెనిఫికేషన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి ఆర్సెలార్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఇండియా ప్రతిపాదనను ,1,490 కోట్ల రూపాయల పెట్టుబడితో డాల్కీలోని డబునా స్లరీ పంపింగ్ స్టేషన్ యూనిట్‌కు ప్రతిపాదిత ప్లాంట్ నుండి 12 MTPA స్లర్రీ పైప్‌లైన్‌ను కూడా కమిటీ ఆమోదించింది. దీని 600 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. సోంపురి ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 24 MTPA పెల్లెట్ ప్లాంట్ మరియు 6 MTPA ఫిల్టర్ కేక్, ఆర్తి స్టీల్స్ ద్వారా స్టీల్ ప్లాంట్ విస్తరణ కూడా ప్రభుత్వం ఆమోదించిన కొన్ని ఇతర ప్రాజెక్టులుగా ఉండనున్నాయి.

అయితే అదానీ గ్రూప్‌కు చెందిన ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ ఆమోదం పొందిందని వార్తలు వెలువడ్డాయి. ఆసియాలో అత్యంత సంపన్నుడైన గౌతమ్ అదానీ వేగంగా విస్తరిస్తున్న తన సామ్రాజ్యానికి మరో ప్రాజెక్టును చేర్చనున్నారు.  అదానీ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ ఒడిశాలో అల్యూమినా రిఫైనరీని ఏర్పాటు చేయడానికి 5.2 బిలియన్ల  డాలర్ల పెట్టుబడి పెట్టాలని యోచిస్తోందని పలు  ఊహాగానాలొచ్చాయి. 

మరిన్ని వార్తలు