దేశంలో తగ్గని స్టార్టప్ కంపెనీల జోరు..!

23 Mar, 2022 18:23 IST|Sakshi

దేశంలో స్టార్టప్ కంపెనీల జోరు అస్సలు తగ్గడం లేదు. తాజాగా ఆక్సిజో ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే స్టార్టప్ కంపెనీ మార్చి 23న ఏ సిరీస్ ఫండ్ రైసింగ్'లో భాగంగా 200 మిలియన్ డాలర్లను సేకరించినట్లు తెలిపింది. దీంతో కంపెనీ వాల్యుయేషన్ 1 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఒక భారతీయ స్టార్టప్ కంపెనీ మొదటి రౌండ్'లో ఇంత మొత్తంలో ఫండ్ సేకరించడం ఇదే మొదటిసారి. కంపెనీ విలువ 1 బిలియన్ డాలర్లకు చేరుకోవడంతో యునికార్న్ కంపెనీగా  ఆక్సిజో ఫైనాన్షియల్ అవతరించింది. టైగర్ గ్లోబల్, నార్వెస్ట్ వెంచర్ పార్టనర్స్, మ్యాట్రిక్స్ పార్టనర్స్, క్రియేషన్ ఇన్వెస్ట్ మెంట్స్ సంయుక్తంగా నాయకత్వం వహించాయి. 

సంవత్సరం కిందటే.. సాఫ్ట్‌బ్యాంక్ గ్రూప్ కార్పోరేషన్, ఇతరుల నుంచి మద్దతు పొందిన తర్వాత కల్రా భర్త ఆశిష్ మొహపాత్రా ఆఫ్‌బిజినెస్‌ కంపెనీ కూడా అదే విలువను చేరుకుంది. తయారీ & సబ్-కాంట్రాక్టింగ్ వంటి రంగాలలో ఎస్ఎమ్ఈల కోసం కొత్త మెటీరియల్ కొనుగోలు చేయడానికి సరిపోయే వర్కింగ్ క్యాపిటల్ ఫైనాన్సింగ్'ను ఈ కంపెనీ అందిస్తుంది. ప్రారంభం నుంచి ఈ కంపెనీ మంచి లాభాల్లో కొనసాగుతుంది. "ఆఫ్ బిజినెస్, ఆక్సిజో రెండూ కూడా 50+ ఆర్థిక సంస్థలలో విశ్వాసాన్ని పెంపొందిస్తూ బలమైన రుణ ప్రొఫైల్ కలిగి ఉన్నాయి" అని ఆఫ్‌బిజినెస్‌ గ్రూప్ సీఈఓ ఆశిష్ మహాపాత్ర చెప్పారు.

ఆదర్శంగా నిలుస్తున్న జంట
కల్రా(38), మోహపాత్ర(41) ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) పూర్వ విద్యార్థులు. మెకిన్సే & కోలో పనిచేస్తున్నప్పుడు వీరిద్దరూ కలుసుకున్నారు. వీరి రెండు స్టార్టప్‌లు కూడా లాభదాయకంగా ఉన్నట్లు వ్యాపారవర్గాల నుంచి వినిపిస్తోంది. కల్రా.. ఆక్సిజో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాగా, మోహపాత్రా.. ఆఫ్‌బిజినెస్‌లో సీఈఓ. మ్యాట్రిక్స్ పార్ట్‌నర్స్ & క్రియేషన్ ఇన్వెస్ట్‌మెంట్స్ కూడా భారత్ స్టార్టప్ పరిశ్రమలో అతిపెద్ద సిరీస్ ఏ రౌండ్‌లలో ఒకటైన ఆక్సిజోలో పెట్టుబడి పెట్టాయి. ఆక్సిజో అనేది ఆక్సిజన్ + ఓజోన్ పదాల మిశ్రమం. 2016 ప్రారంభంలో మరో ముగ్గురితో కలిసి ప్రారంభించిన ఈ జంట మొదటి స్టార్టప్ ఆఫ్‌బిజినెస్‌. ఆ తర్వాత కల్రా, మోహపాత్ర, మరో ముగ్గురు కలిసి 2017లో ఆక్సిజోను స్థాపించారు. 

(చదవండి: హోండా సరికొత్త రికార్డులు.. ఏకంగా 30 లక్షలకుపైగా..)

>
మరిన్ని వార్తలు