Petrol Price Hike: 23వ సారి.. హైదరాబాద్‌లో సెంచరీ క్రాస్‌!

11 Jun, 2021 08:38 IST|Sakshi

38 రోజుల్లో 23 సార్లు పెంపు

జూన్‌లో రూ. 1.36 పైసలు పెరిగిన ధర

హైదరాబాద్‌లో వంద మార్క్‌ క్రాస్‌

హైదరాబాద్‌: పెరగడమే కానీ తగ్గడం తనకు లేదన్నట్టుగా ఉంది పెట్రోలు ధరల పరిస్థితి. తాజాగా మరోసారి పెట్రోలు, డీజిల్‌ ధరలను పెంచాయి ఆయిల్‌ కంపెనీలు. పెట్రోలు, డీజిల్‌లపై లీటరుకు 29 పైసల వంతున ధర పెంచుతున్నట్టు ప్రకటించాయి.  నిన్న కాక మొన్న జూన్ 9న పెట్రోలుపై లీటరుకు 23-25 పైసలు, డీజిల్‌పై 23-27 పైసల మేర ధరను చమురు కంపెనీలు పెంచాయి. ఒక్కరోజు గ్యాప్‌ ఇచ్చి వినియోగదారులపై మరోసారి భారం మోపాయి.

హైదరాబాద్‌లో ‘సెంచరీ’
తాజా పెంపుతో హైదరాబాద్‌లో పెట్రోలో ధర వంద దాటనుంది. జూన్‌ 9న పెరిగిన పెట్రోల్‌ ధరలతో హైదరాబాదులో లీటరు  పెట్రోలు ధర రూ.99.31,  డీజిల్‌  రూ. 94.26గా నమోదు అయ్యింది. తాజాగా 29 పైసలు పెంచడంతో భాగ్యనగరంలో కూడా పెట్రోలు సెంచరీని దాటింది. ఇప్పటికే ఏపీలో పెట్రోలు ధరలు వందను దాటేశాయి. ధరల పెరుగుదలలో ఇదే ట్రెండ్‌ కొనసాగితే డీజిల్‌ వందను దాటడానికి ఎక్కువ రోజులు పట్టదు. 

ఫలితాల తర్వాత
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎడాపెడా పెట్రోలు ధరలు పెరుగుతూనే ఉన్నాయి.  మే 4 నుంచి జూన్‌ 11 వరకు 23 సార్లు పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరిగాయి. జూన్‌లో ఇప్పటి వరకు పెట్రోల్ రిటైల్ ధర లీటరుకు సుమారు రూ. 1.37 రూపాయలు పెరిగింది.

చదవండి : ఎలక్ట్రిక్ సైకిల్... 70 కి.మీ మైలేజ్

మరిన్ని వార్తలు