పెరిగిన పెట్రోలు, డీజిల్‌ ధరలు

5 Oct, 2021 12:06 IST|Sakshi

అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడం ఆలస్యం చమురు కంపెనీలు ఆ భారాన్ని ప్రజలపై నేరుగా మోపాయి. మంగళవారం లీటరు పెట్రోలుపై 29 పైసలు, లీటరు డీజిల్‌పై 32 పైసల వంతున ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ.106.73లకు చేరుకోగా లీటరు డీజిల్‌ ధర రూ. 99.33గా నమోదు అయ్యింది. 

ఇకపై బాదుడే
నవంబరు వరకు ముడి చమురు ఉత్పత్తిని పరితంగానే చేయాలని ఒపెక్‌ దేశాలు నిర్ణయించాయి. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్‌ అయిల్‌కి డిమాండ్‌ పెరిగిపోయింది. దీంతో నవంబరు వరకు ముడి చమురు ధరలు తగ్గే అవకాశం లేదు. దీంతో మరో రెండు నెలల వరకు ప్రలజకు పెట్రో వడ్డన చేయనుంది ప్రభుత్వం.

వెనువెంటనే
జులై చివరి వారం నుంచి ఆగస్టు, సెప్టెంబరు వరకు అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గాయి. బ్రెండ్‌ క్రూడ్‌ ఆయిల్‌ బ్యారెల్‌ ధర 75 డాలర్ల నుంచి 56 డాలర్ల వరకు పడిపోయింది. ఆ సమయంలో ధరల స్థిరీకరణ పేరుతో పెట్రోలు, డీజిల్‌ ధరలను తగ్గించేందుకు చమురు కంపెనీలు ఆసక్తి చూపించలేదు. కంటి తుడుపు చర్యగా కేవలం రూపాయికి అటుఇటుగా పెట్రోలు, డీజిల్‌ రేట్లు తగ్గించారు. కానీ గత వారం రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో ఆయిల్‌ ధర పెరగడం ఆలస్యం ఆ భారాన్ని వెంటనే సామాన్యులపై మోపింది ప్రభుత్వం. 

చదవండి : పెట్రోల్‌ బాదుడు.. తగ్గేదేలేదు!

మరిన్ని వార్తలు