డీజిల్‌ రేట్లలో కోత.. 20 పైసల తగ్గింపు

18 Aug, 2021 14:14 IST|Sakshi

హైదరాబాద్‌ : గత కొంత కాలంగా ధరలు పెంచడమే తప్ప తగ్గించడం తెలియదు అన్నట్టుగా నిర్ణయాలు తీసుకుంటూ పోతున్న చమురు కంపెనీలు శాంతించాయి. నెల రోజులగా పెట్రోలు, డీజిల్‌ ధరలు నిలకడగా ఉండటంతో కొంత తేరుకుంటున్న సామాన్యులకు మరో ఉపశమనం కలిగించాయి. లీటరు డీజిల్‌పై 20 పైసల వంతున ధర తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గుముఖం పట్టడంతో ఈ మార్పు చోటు చేసుకుంది. అయితే పెట్రోలు ధర తగ్గించకపోవడంపై ప్రజల్లో అంసంతృప్తి నెలకొంది. 

ధరల తగ్గింపుకు ముందు హైదరాబాద్‌లో లీటరు డీజిల్‌ ధర రూ.97.96లు ఉండగా తాజా తగ్గింపుతో రూ.97.74లుగా ఉంది. అంతకు ముందు ఆగస్టు 8వ తేదిన సైతం డీజిల్‌ రేటు 14 పైసలు తగ్గింది. అంతకు ముందు ఈ నెలలో అత్యధిక ధరగా రూ.98.10 డిజిల్‌ ధర ఉంది.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు