సామాన్యులకు షాక్‌, భారీగా పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధర!

6 Jul, 2022 09:05 IST|Sakshi

న్యూఢిల్లీ: పెరిగిపోతున్న నిత్యవసర వస్తువుల ధరలతో బెంబేలెత్తుతున్న వినియోగదారునికి మరో షాక్‌. ఇళ్లలో వినియోగించే 14.2కేజీల సిలిండర్‌పై రూ.50 ధరని పెంచుతూ చమురు కంపెనీలు ప్రకటించాయి.దీంతో రూ.1055 నుంచి రూ.1105కు చేరిన సిలిండర్‌ ధరకు చేరింది. ఇక పెరిగిన ధరలు నేటి నుంచి అమల్లోకి రానున్నాయి.  

కాగా, 5కేజీల డొమెస్టిక్‌ గ్యాస్‌ ధరను చమురు కంపెనీలు రూ.188కి పెంచాయి. 19కేజీల కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధరను మాత్రం రూ.8.50కి తగ్గించాయి. 

సామాన్యులకు ధరాఘాతం
ఓ వైపు నిత్యావసర సరుకుల ధరలు పెరిగి సామాన్యులు కొనలేని పరిస్థితిలో ఉండగా..మరోవైపు పెరిగిపోతున్న ఎల్పీజీ గ్యాస్‌ ధరలతో ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. బుధవారం చమురు కంపెనీలు డొమెస్టిక్‌ గ్యాస్‌ ధరను రూ.50కి పెంచాయి. దీంతో జులై 2021 నుంచి ఇవాళ్టితో మొత్తం 8సార్లు గ్యాస్‌ ధరల్ని పెంచినట్లైంది. ఇదిలా ఉండగా, జూలైలో కమర్షియల్‌ సిలిండర్ల ధరల్ని రెండోసారి తగ్గించింది. అంతకుముందు జూలై 1న 19 కిలోల ఎల్‌పిజి సిలిండర్‌ను రూ.198 తగ్గించారు.

సెక్యూరిటీ డిపాజిట్‌ను పెంచేసింది
ఈ జూన్‌ నెలలో కేంద్ర పెట్రోలియం,సహజ వాయువు మంత్రిత్వ శాఖ గ్యాస్‌ వినియోగం కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.  జులై 16 నుంచి గ్యాస్ కొత్త కనెక్షన్లు  తీసుకునే వారు చెల్లించాల్సిన వన్‌టైమ్ సెక్యూరిటీ డిపాజిట్‌ను పెంచుతూ ఆదేశాలు జారీ చేసింది. 

అంటే గ్యాస్ కొత్త కనెక్షన్లు  తీసుకునే వారు చెల్లించాల్సిన వన్‌టైమ్ సెక్యూరిటీ డిపాజిట్‌ను 14.2 కిలోల డొమెస్టిక్  సిలిండర్‌పై సెక్యూరిటీ డిపాజిట్ రూ.1450 ఉండగా.. దాని పెంపుతో  కొత్తసింగిల్ సిలిండర్ ఇండేన్ కనెక్షన్ కోరుకునే వారు  రూ.2,500కు పైనే  చెల్లించాలని స్పష్టం చేసింది. ఇక రూ. 800గా ఉన్న 5 కేజీల సిలిండర్ డిపాజిట్ మొత్తం రూ. 1150కు చేరింది.  దీంతోపాటు రెగ్యులేటర్‌కు గతంలోని 150 రూపాయలతో పోలిస్తే ఇపుడు రూ. 250 చెల్లించాలి. 

కాగా, సబ్సిడీ దుర్వినియోగాన్ని అరికట్టేందుకు జరుగుతున్న కసరత్తుతోపాటు, ఏ వంటగదిలోనూ ఒకటి కంటే ఎక్కువ కనెక్షన్లు (గరిష్టంగా రెండు సిలిండర్లు) ఉండకూడదనే లక్ష్యంతో  ఈ నిర్ణయం తీసుకున్నట్టు చమురు మార్కెటింగ్‌ కంపెనీలు చెబుతున్నాయి.

మరిన్ని వార్తలు