Electric Scooter: రూ. 40 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్

6 Jul, 2021 16:24 IST|Sakshi

ఎనర్జీ స్టోరేజీ సొల్యూషన్స్ ప్రొవైడర్ ఓకాయా గ్రూప్ ఎలక్ట్రిక్ టూ వీలర్ వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించింది. అంతేగాకుండా, ఇప్పటికే  హిమాచల్ ప్రదేశ్ లో ద్విచక్ర వాహనాల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసిన సంస్థ హర్యానాలో మరో తయారీ కర్మాగారాన్ని, నీమ్రానా(రాజస్థాన్)లో మరో మూడు ప్లాంట్లను 2023-25 నాటికి ప్రారంభించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. అవియోనిక్ సిరీస్, క్లాస్ ఐక్యూ సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో అధునాతమైన టెక్నాలజీని భారతీయ పరిస్థితులకు అనుగుణంగా తీసుకొస్తున్నట్లు తెలిపింది. 

ఈ స్కూటర్లు రూ.39,999 - రూ.60,000 ధరల శ్రేణిలో అందుబాటులో ఉంటాయి. భారతదేశంతో పాటు విదేశాల్లో కూడా ప్రత్యేకంగా రెండు అత్యాధునిక ఆర్ అండ్ డి సెంటర్లు నెలకొల్పనున్నట్లు తెలిపింది. ఈ వాహనాలకు సరఫరాలో ఎటువంటి అంతరాయం లేకుండా దేశవ్యాప్తంగా షోరూమ్ లతో పాటు పంపిణీ, సేవా కేంద్రాలను తెరవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఓకాయా పవర్ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ గుప్తా తెలిపారు.

ఢిల్లీ, జైపూర్లలో రెండు ఎక్స్‌పీరియన్స్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. అంతేగాక, ఈ ఆర్థిక సంవత్సరంలో ఈ సెగ్మెంట్ కింద నాలుగు ఉత్పత్తులను విడుదల చేయడానికి సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. ఈ ఉత్పత్తులన్నీ పూర్తిగా 'మేడ్-ఇన్ ఇండియా'గా ఉంటాయి. 2025 నాటికి భారతీయ రోడ్లపై కోటి ఈ-స్కూటర్లను తీసుకొని రావలన్న ప్రభుత్వ కలను సాకారం చేసేందుకు తమ వంతు సహకారం అందించనునట్లు గుప్తా తెలిపారు.

మరిన్ని వార్తలు