రూ.40 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. రేంజ్ కూడా ఎక్కువే!

25 Oct, 2021 21:16 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రముఖ ఓకాయా పవర్ గ్రూప్ ఎలక్ట్రిక్ టూ వీలర్ వ్యాపారంలోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. అంతేగాకుండా, ఇప్పటికే  హిమాచల్ ప్రదేశ్ రాష్టంలో ద్విచక్ర వాహనాల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసిన సంస్థ హర్యానాలో మరో తయారీ కర్మాగారాన్ని, నీమ్రానా(రాజస్థాన్)లో మరో మూడు ప్లాంట్లను 2023-25 నాటికి ప్రారంభించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. అవియోనిక్ సిరీస్, క్లాస్ ఐక్యూ సిరీస్, ఫ్రీడమ్ సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లలో అధునాతమైన టెక్నాలజీని ప్రస్తుత భారతీయ పరిస్థితులకు అనుగుణంగా తీసుకొస్తున్నట్లు తెలిపింది. 

అందుకే, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరగడంతో కొత్తగా మరో ఏడు రాష్ట్రాల్లో 165 ఎలక్ట్రిక్ టూ వీలర్(ఈ2డబ్ల్యు) డీలర్లను ఓకాయా పవర్ గ్రూప్ నియమించింది. "నవరాత్రి పండుగ సందర్భంగా ఇటీవల ప్రారంభించిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు వినియోగదారుల నుంచి అద్భుతమైన స్పందన రావడంతో ఓకాయా పవర్ గ్రూప్ తన డీలర్ షిప్ నెట్ వర్క్ ను ఇండియా మొత్తం విస్తరించడానికి ప్రణాళికలను ప్రకటించింది. ఓకాయా ఈవీ ఇప్పటికే భారతదేశంలోని 18 రాష్ట్రాల్లో 165 మంది డీలర్లను నియమించింది" అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. భారతదేశంతో పాటు విదేశాల్లో కూడా ప్రత్యేకంగా రెండు అత్యాధునిక ఆర్ అండ్ డి సెంటర్లు నెలకొల్పనున్నట్లు సంస్థ తెలిపింది. ఈ ఓకాయా స్కూటర్ల ధర రూ.39,999 నుంచి అందుబాటులో ఉండనున్నాయి. 

ఈ కంపెనీ స్కూటర్లను ఒకసారి చార్జ్ చేస్తే 80 కిలోమీటర్ల వరకు వెళ్లనున్నాయి. వీటిని నడపడానికి ఎటువంటి లైసెన్సు, రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఓకాయా పవర్ గ్రూప్ 4 దశాబ్దాలుగా భారతదేశంలో బ్యాటరీ తయారీ రంగంలో నమ్మకానికి, నాణ్యతకు చిహ్నంగా ఉంది. దేశంలో బ్యాటరీ తయారీ పరిశ్రమలో అగ్రగామిగా ఉంది. ఈ అనుభవంతోనే ఓకా ఎలక్ట్రిక్ మొబిలిటీ రంగంలోనికి ప్రవేశించింది. ఈ సంస్థ ఎలక్ట్రిక్ వేహికల్స్, ఎలక్ట్రిక్ వేహికల్ బ్యాటరీల నుంచి ఈవి ఛార్జింగ్, బ్యాటరీ స్వాపింగ్ పరిష్కారాల వరకు అన్నటికి సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తుంది. 

(చదవండి: మార్కెట్లోకి మరో కిల్లర్ స్మార్ట్‌ఫోన్‌.. ఫీచర్స్ అదుర్స్!)

మరిన్ని వార్తలు