ఒకినావా రూ.220 కోట్ల పెట్టుబడి 

26 Jan, 2023 12:09 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహన తయారీలో ఉన్న ఒకినావా ఆటోటెక్‌ కొత్త మోడళ్లు, పవర్‌ట్రైన్‌ అభివృద్ధికి రూ.220 కోట్లు పెట్టుబడి చేయనున్నట్టు ప్రకటించింది. ఇటలీలో నెలకొల్పిన పరిశోధన, అభివృద్ధి కేంద్రంలో నూతన మోడళ్లకు రూపకల్పన చేయనున్నట్టు వెల్లడించింది. జేవీ భాగస్వామి అయిన టాసిటాతో కలిసి ఈ ఆర్‌అండ్‌డీ ఫెసిలిటీని కంపెనీ ఏర్పాటు చేసింది.

ఇటలీ కేంద్రం నుంచి రూపుదిద్దుకున్న తొలి ఎలక్ట్రిక్‌ క్రూజర్‌ మోటార్‌సైకిల్‌ ఈ ఏడాదే భారత్‌లో అడుగుపెట్టనుంది. అంతర్జాతీయంగా అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతికను భారత్‌కు తీసుకు వచ్చేందుకే ఆర్‌అండ్‌డీ సెంటర్‌ స్థాపించినట్టు తెలిపింది. గడిచిన అయిదేళ్లలో రూ.500 కోట్లు పెట్టుబడి చేసినట్టు ఒకినావా ఎండీ జితేందర్‌ శర్మ వెల్లడించారు. తదుపరితరం పవర్‌ట్రైన్‌ ను ఇటలీ కేంద్రంలో అభివృద్ధి చేస్తామన్నారు.

చదవండి: Air India: ఉద్యోగులకు బంఫర్‌ ఆఫర్‌ ప్రకటించిన ఎయిర్‌ ఇండియా.. దాదాపు 8 వేల మందికి

మరిన్ని వార్తలు