ఆ స్కూటర్లు వెనక్కి తీసుకుంటాం

16 Apr, 2022 16:36 IST|Sakshi

ప్రముఖ ఎలక్ట్రిక్‌ స్కూటర్ల తయారీ సంస్థ ఒకినావా సంచలన నిర్ణయం తీసుకుంది. వరుసగా అగ్ని ప్రమాదాలు జరుగుతుండటంతో అప్రమత్తమైంది. తమ కంపెనికి చెందిన స్కూటర్లను రీకాల్‌ చేస్తామంటూ ప్రకటించింది.

2022 మార్చి 26న తమిళనాడులో ఛార్జింగ్‌ పెట్టిన సమయంలో ఒకినావా స్కూటు తగలబడి పోయింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సచలనంగా మారింది. మరో రెండు రోజులకే తమిళనాడులోని తిరుచ్చిలో మరో స్కూటర్‌లో బ్యాటరీ కాలిపోయింది. దీంతో ప్రమాదానికి గురైన ఒకినావా ప్రైస్‌ ప్రో మోడళ్లను రీకాల్‌ చేస్తున్నట్టు ప్రకటించింది.

ఒకినావా రీకాల్‌ చేయాలని నిర్ణయించిన ఒకినావా ప్రైస్‌ ప్రో మోడల్‌ స్కూటర్లు దేశవ్యాప్తంగా 3,125 అమ్మడుడయ్యాయి. కొనుగోలుదారులు దేశవ్యాప్తంగా ఉ‍న్న ఒకినావా షోరూమ్‌లకు వెళ్లి వీటిని వెనక్కి ఇచ్చేయవచ్చు. ఇలా తీసుకున్న స్కూటర్ల భద్రతను మరోసారి సంపూర్ణంగా పరిశీలించనుంది ఒకినావా.

ఒకినావా స్కూటర్‌ కేంద్ర కార్యాలయం, తయారీ యూనిట్‌ హర్యాణాలో ఉంది. ఇప్పటి వరకే దేశవ్యాప్తంగా ఒకినావాకి సంబంధించి మొత్తం 25,000 స్కూటర్లు, బైకులు అమ్ముడయ్యాయి. ఇందులో హై స్పీడ్‌ వెహికల్‌ విభాగంలో అక్కడక్కడా ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో అందులో బ్యాటరీ పనితీరు, రక్షణ వ్యవస్థలను చెక్‌ చేయాలని ఒకినావా నిర్ణయించింది.

చదవండి: ఓలా, ఒకినావా ఈవీ స్కూటర్‌ అగ్నిప్రమాదంపై కేంద్రం కీలక నిర్ణయం..!

మరిన్ని వార్తలు