వందల మంది ఉద్యోగులకు భారీ షాక్‌, ‘ఓలా.. ఎందుకిలా!’

19 Sep, 2022 15:13 IST|Sakshi

ప్రముఖ రైడ్‌ షేరింగ్‌ దేశీయ దిగ్గజ సంస్థ ఓలాలో కీలక పరిణామలు చోటు చేసుకుంటున్నాయి. సంస్థ పునర్నిర్మాణం పేరుతో  ఇప్పటికే వందలాది ఉద్యోగుల్ని ఇంటికి పంపిన ఓలా.. తాజాగా 500 మందిని విధుల నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. 

ఉద్యోగుల్ని ఫైర్‌ చేయడానికి కారణం ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ సేల్స్‌ తగ్గిపోవడమేనని పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. గతేడాది డిసెంబర్‌లో ఓలా ఈవీ వెహికల్స్‌ను లాంఛ్‌ చేసింది. నాటి నుంచి సంస్థ పునర్నిర్మాణ కార్యక్రమాల్ని నిర్వహిస్తూనే ఉంది. ఈ క్రమంలో ప్రీ ఓన్డ్‌ కార్‌ బిజినెస్‌,ఓలా కార్స్‌, ఓలా డాష్‌ ఇలా సుమారు 2 వేల మంది ఉద్యోగులతో పాటు..గత రెండేళ్లలో ఆ సంస్థ సీఈవో భవిష్ అగర్వాల్ నాయకత్వ బృందం సభ్యులతో సహా 30 మందికి పైగా సీనియర్ అధికారుల్ని ఇంటికి సాగనంపింది. 

షట్‌ డౌన్‌ 
ఈ ఏడాది జులై నెలలో ఓలాకు చెందిన కర్ణాటక ప్లాంటును షట్‌ డౌన్‌ చేసింది. ఆ తర్వాత మూడు వారాల్లో సుమారు 350మంది ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించింది. తాజాగా మరో 500 మంది ఉద్యోగుల్ని తొలగించినట్లు పలు మీడియా సంస్థలు కథనాల్ని ప్రచురించాయి. 

ఇప్పుడు 500 మంది
వెహికల్‌, బ్యాటరీ తయారీ, ఆటోమేషన్, అటానమస్ ఇంజినీరింగ్ స్ట్రీమ్‌లు, ఇతర విభాగాలకు చెందిన ఐటీ, ఆర్ అండ్ డి సామర్థ్యాలను నిర్మించడంపై దృష్టి సారించింది. అందుకే వాటిని బలోపేతం చేసే దిశగా పునర్నిర్మాణ కార్యక్రమాల్ని నిర్వహిస్తున్నట్లు’ ఓలా ప్రతినిధులు తెలిపారు. మరో వైపు 500 మంది ఉద్యోగుల‍్ని ఫైర్‌ చేయడంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. 

చదవండి👉 ఓలా: వెళ్లిపోతాం..ఇక్కడే ఉంటే మునిగిపోతాం..పెట్టేబేడా సర్దుకుని!

మరిన్ని వార్తలు