ఆ ఐడియా సూపర్ హిట్.. నేడు వేల కోట్లకు అధిపతిగా..

18 Dec, 2022 15:33 IST|Sakshi

ప్రస్తుత రోజుల్లో ఓలా కంపెనీ పేరు తెలియని వారుండరు.  నగర ప్రజలకు ఎనలేని సేవలు అందిస్తూ , మరో వైపు ఎందరో ట్యాక్సీ డ్రైవర్లకు ఉపాధి కల్పిస్తోంది ఓలా. ఎన్నో ఒడిదుడుకులు, జయఅపజయాలు ఎదుర్కొని ఒక చిన్న స్టార్టప్‌ కంపెనీగా మొదలై  ప్రస్తుతం కొన్ని వేల కోట్ల కంపెనీగా రూపాంతరం చెందింది ఈ సంస్థ. ఓలా ఈ స్థాయికి చేరుకోవడానికి ఎన్నో కష్టనష్టాలు, వ్యయప్రయాసలు, అవమానాలు పడ్డా సంస్థ వ్యవస్థాపకుడు , సీఈఓ భవిష్‌ అగర్వాల్‌కు ఈ విజయం అంత సులువుగా రాలేదు. ఆయన సక్సెస్‌ స్టోరీపై ఏంటో తెలుసుకుందాం!

ఐఐటీ బాంబేలో చదువు
భవిష్ అగర్వాల్ పంజాబ్‌లోని లూథియానాలో పెరిగారు. ఆయన 2008లో ఐఐటీ బాంబే నుంచి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసారు. అగర్వాల్ 2008లో దేశీటెక్‌.ఇన్‌ (Desitech.in)పేరుతో బ్లాగర్‌గా తన స్వంత బ్లాగును ప్రారంభించారు.ఈ వెబ్‌సైట్‌ దేశంలోని సాంకేతిక రంగంలో సరికొత్త స్టార్టప్‌ల గురించి సమాచారాన్ని అందిస్తుంది. మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ ఇండియాలో రీసెర్చ్ ఇంటర్న్‌గా తన కెరీర్‌ను ప్రారంభించిన ఆగర్వాల్‌ రెండేళ్లపాటు అందులో పనిచేశాడు.

ఆ ఘటనే మార్చింది..
ఒకసారి భవిష్ తన స్నేహితులతో కలిసి టూర్‌ ప్లాన్‌ చేసుకున్నాడు. అందుకోసం వారు అద్దెకు టాక్సీ బుక్ చేసుకున్నారు( బెంగళూరు నుంచి బందీపూర్‌కు వరకు) అయితే టాక్సీ డ్రైవర్‌ సడన్‌గా మైసూర్‌లో బండి ఆపేశాడు. తనకు ఈ ప్రయాణ ఖర్చులు సరిపోవని, ఇంకాస్త అదనంగా డబ్బులు ఇవ్వాలని వారిని డిమాండ్ చేశాడు.  చివరికి వారు చెల్లించేందుకు అంగీకరించలేదు.

దీంతో అక్కడే వారిని వదిలి టాక్సి డ్రైవర్ వెళ్లిపోయాడు. ఇదంతా అందులో ఉన్న భవిష్ అగర్వాల్‌ను ఆలోచనలో పడేసింది. ఇలాంటి పరిస్థితులు ప్రజలకు పలు సందర్భాల్లో ఎదురవుతుంటాయనే విషయాన్ని భవిష్‌ అర్థం చేసుకున్నాడు. ఈ సమస్యకు పరిష్కారంగానే నుంచే ఓలా ఆలోచన పుట్టుకొచ్చింది. 

ఉద్యోగం వదిలేసి..
భవిష్‌కు టెక్నాలజీపై ఆసక్తి ఉండటంతో.. అతని ఓ ఆలోచన వచ్చింది. అలా అతనికి అద్దె కార్ల ఐడియా ప్రస్తుతం ప్రముఖ సంస్థ ఓలా గా మారింది. మొదట్లో తన ఆలోచనకు కుటుంబ సభ్యుల మద్దతు లభించలేదు. ఓ సందర్భంలో 2010లో లక్షలు వస్తున్న మైక్రోసాఫ్ట్ ఉద్యోగాన్ని సైతం వదలాల్సిన పరిస్థితి ఏర్పడిన ధైర్యంగా రాజీనామా చేశాడు. తాను అనుకున్న గమ్యాన్ని చేరుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగాడు.

చివరికి స్నేహితుడు అంకిత్ భాటియాతో కలిసి ఓలా కంపెనీని ప్రారంభించారు. ప్రస్తుతం ఓలా దాదాపుగా 15 లక్షల మందికి పైగా ట్యాక్సీ డ్రైవర్లకు ఉపాధి కల్పిస్తూ వేల కోట్ల విలువైన కంపెనీగా కార్యకలాపాలని నిర్వహిస్తోంది.

చదవండి: Income Tax: కేంద్రం దీనికి ఓకే అంటే.. పన్ను చెల్లింపుదారులకు పండగే!

మరిన్ని వార్తలు :

మరిన్ని వార్తలు