OLA CEO: మా పేరెంట్స్‌కి స్కూటర్‌ చేరిందన్న భవీష్‌ అగర్వాల్‌.. ఓలా సీఈవోపై కస్టమర్ల ఆగ్రహం?

26 Feb, 2022 13:22 IST|Sakshi

OLA CEO Bhavish Aggarwal: ఇండియన్‌ ఆటోమొబైల్‌ ఇండస్ట్రీలో ఎప్పుడూ లేనంత హైప్‌ క్రియేట్‌ చేసింది ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌. రికార్డు స్థాయిలో ప్రీ బుకింగ్స్‌ సాధించింది. రిలీజ్‌కు ముందు వచ్చిన హైప్‌ని సరిగా ఉపయోగించుకోవడంలో ఓలా విఫలమైంది. డెలివరీలు ఆలస్యంగా జరుగుతున్నాయి. దీంతో సందర్భం ఏదైనా సరే ఓలా స్కూటర్స్‌ సీఈవో భవిష్య అగర్వాల్‌పై కస్టమర్లు విరుచుకు పడుతున్నారు.

ఓలా సీఈవో భవీష్‌ అగర్వాల్‌ తల్లిదండ్రులు పంజాబ్‌లోని లుథియానాలో నివసిస్తున్నారు. దేశంలో మిగిలిన కస్టమర్లలాగే 2021 ఆగస్టు 15న వారు కూడా ఓలా స్కూటర్‌ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్నారు. ఇంచు మించు ఆరు నెలల తర్వాత ఆ స్కూటర్‌ని లుథియానాలో భవీష్‌ అగర్వాల్‌ తల్లిదండ్రులకు డెలవరీ అయ్యింది. ఈ విషయాన్ని ట్విట​‍్టర్‌లో ఎంతో సంతోషంగా తెలిపారు భవీష్‌ అగర్వాల్‌.

భవీష్‌ అగర్వాల్‌ ట్వీట్‌కి నెటిజన్ల నుంచి నెగటివ్‌ స్పందన వచ్చింది. ఆరు నెలలుగా ఇంచుమించు లక్షన్న రూపాయలు చెల్లించి స్కూటర్‌ కోసం ఎదురు చూస్తున్నామని ఇంత వరకు ఎందుకు డెలివరీ చేయడం లేదంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్రస్టేట్‌ అవకుండా ఓలా స్కూటర్‌ అందుకోవడం కష్టమంటున్నారు.

మేము చెల్లించిన డబ్బలుకు వడ్డీ ఎవరు ఇస్తారు ? ఎన్ని సార్లు అడిగినా కాపీ పేస్ట్‌ సమాధానాలు తప్పితే మీ నుంచి ఏమీ రావడం లేదు ? ఒక మోడల్‌ బుక్‌ చేస్తే మరో మోడల్‌ డెలివరీ చేశారంటూ ఒకరి తర్వాత ఒకరుగా నెటిజన్లు భవీష్‌ అగర్వాల్‌పై మండిపడుతున్నారు.  
 

>
మరిన్ని వార్తలు