ఓలా స్కూటర్ గురించి సీఈఓ భవిష్ అగర్వాల్ ఆసక్తికర ట్వీట్

27 Oct, 2021 14:59 IST|Sakshi

బెంగళూరు: ప్రముఖ ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ సీఈఓ భవిష్ అగర్వాల్ నేడు మరో ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో కొత్త ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లు ఓలా ఎస్1, ఓలా ఎస్1 ప్రో స్కూటర్ల తయారీ విధానాన్ని వీడియో ద్వారా షేర్ చేశారు. ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీలో ఉన్న మహిళా కార్మికులు డెలివరీకి ముందు ఓలా ఎస్ 1 స్కూటర్ ఉత్పత్తి ప్రక్రియను వేగంగా చేస్తున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ ప్రకటించింది. ఓలా ఎలక్ట్రిక్ సంస్థ ఓలా ఎస్1, ఓలా ఎస్1 ప్రో స్కూటర్ మొదటి టెస్ట్ రైడ్లను నవంబర్ 10 నుంచి అందించాలని యోచిస్తోంది. 

అలాగే, నవంబర్ 1 నుంచి ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల బుకింగ్స్ కూడా కంపెనీ తిరిగి ప్రారంభిస్తుంది. ఓలా సీఈఓ అగర్వాల్ ఇటీవల సంస్థ మొదటి హైప‌ర్ ఛార్జ‌ర్‌ను ప్రారంభించినట్లు ప్రకటించిన విషయం కూడా మనకు తెలిసిందే. ఓలా ఎలక్ట్రిక్ మొదటి హైపర్ ఛార్జర్ వద్ద ఓలా ఎస్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జింగ్ వీడియోను ఆయన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేశారు. "ఓలా" ఎల‌క్ట్రిక్ భార‌త‌దేశంలోని 400 న‌గ‌రాల్లో హైప‌ర్ ఛార్జ‌ర్ నెట్ వర్క్ కింద ల‌క్ష ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్‌ల‌ను ఏర్పాటు చేయాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. ఛార్జింగ్ పాయింట్ల వద్ద 18 నిమిషాల ఛార్జింగ్ చేస్తే 75 కిలోమీటర్ల వరకు వెళ్లనున్నాయి అని ఓలా పేర్కొంది. ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్ 'ఎస్ 1 ప్రో'ను ఒక‌సారి ఫుల్ ఛార్జింగ్‌ చేస్తే 181 కిలోమీట‌ర్ల దూరం వ‌ర‌కు వెళుతుంద‌ని కంపెనీ తెలిపింది. 

(చదవండి:  సామాన్యుడికి షాక్.. రూ.120 దిశగా పెట్రోల్‌ పరుగులు)

మరిన్ని వార్తలు