ఓలా దివాలీ గిఫ్ట్‌: కొత్త ఎల‌క్ట్రిక్  స్కూటర్‌, అతిచౌక ధరలో

10 Oct, 2022 11:38 IST|Sakshi

సాక్షి, ముంబై:  దీపావళి సందర్భంగా ఓలా ఎల‌క్ట్రిక్  తన వినియోగదారుల కోసం మ‌రో  కొత్త ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను మార్కెట్‌లో లాంచ్‌ చేయనుంది. ఎల‌క్ట్రిక్ వాహనాలకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో అతి చౌకధరలో కొత్త వేరియంట్‌ను వినియోగ దారులకు అందుబాటులోకి తెచ్చేందుకు ప్లాన్‌ చేస్తోంది. రూ.80 వేల లోపు ధ‌ర‌కే ఈ కొత్త వేరియంట్‌ స్కూటర్‌ను అందుబాటులోకి తేనుందని సమాచారం.

ఓలా ఎస్‌1 ఎల‌క్ట్రిక్ స్కూటర్‌ను కొత్త వేరియంట్‌ను తీసుకొస్తున్నట్టు  కంపెనీ  సీఈవో భావిష్ అగ‌ర్వాల్ ఆదివారం ట్వీట్ చేశారు.  అక్టోబర్ 22న కంపెనీ దీపావళి ఈవెంట్ జరగ బోతోంది. తమ అతిపెద్ద ప్రకటనలలో ఇది కూడా ఒకటి. త్వరలో కలుద్దాం అంటూ  ఆయన ట్వీట్‌ చేశారు.  దీనికి సంబంధించి ఒక టీజర్‌ కూడా వదిలారు. ఇందులో ఆగస్ట్ 15 ఈవెంట్‌లో వాగ్దానం చేసినట్లుగా కంపెనీ MoveOS 3ని Ola S1కి రోల్‌అవుట్‌గా ప్రకటించే అవకాశం ఉందని అంచనా.  (హీరో తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ వచ్చేసింది.. బుకింగ్‌.. ఫీచర్లు, ధర వివరాలు)

ఓలా ఎల‌క్ట్రిక్ ..ఎస్‌1 ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ రూ.99,999ల‌కు భార‌త్ మార్కెట్‌లో ప్రస్తుతం లభిస్తోంది.  ఓలా ఎస్‌1, ఓలా ఎస్‌1 ప్రో ఈ-స్కూట‌ర్లు దేశీయ  మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఇది టీవీఎస్ జూపిటర్ , సుజుకి యాక్సెస్ వంటి ప్రముఖ 125సీసీ స్కూటర్‌లకు పోటీ ఇస్తోంది.  దీనికితోడు హీరో మోటాకార్స్‌ కూడా తన తొలి ఎల‌క్ట్రిక్ స్కూట‌ర్‌ను విడా బ్రాండ్‌ కింద రెండు వేరియంట్లలో  విడా వీ1, వీ1 ప్రొను లాంచ్‌ చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు