ఓలా సరికొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌.. కస్టమర్ల కోసం అదిరిపోయే బెనిఫిట్స్‌

30 Jan, 2023 15:02 IST|Sakshi

భారత్‌లో ఆటోమొబైల్‌ రంగం వృద్ది వైపు పరుగులు పెడుతోంది. కరోనా తర్వాత ఈ రంగంలో సేల్స్‌ ఆశాజనకంగా ఉన్నాయి. అంతేకాకుండా కాలుష్య నివారణ, ఇంధన వాడకం తగ్గించే క్రమంలో మార్కెట్‌లోకి వస్తున్న ఎలక్ట్రిక్‌ వాహనాలు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడుతోంది.

ఈవీ మార్కెట్లో ఓలా సంస్థ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్‌ బైక్‌ల సేల్స్‌లో దూసుకెళ్తోంది. తాజాగా తమ కస్టమర్లకు మరిన్ని ప్రయోజనాలు అందించేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగానే తాజాగా రెండు కొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించడం కోసం ఓలా కేర్, ఓలా కేర్+ ప్లాన్‌లను ప్రారంభించింది.  ఈ ప్లాన్‌ల ధర వరుసగా రూ. 1,999, కేర్‌ ప్లస్‌ రూ. ₹2,999

ఓలా కేర్‌ బెనిఫిట్స్‌ ఇలా..
ఓలా కేర్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లలో భాగంగా, కస్టమర్‌లు ఉచిత హోమ్ సర్వీసింగ్ వంటి సేవలను అందిస్తోంది. ఇందులో ఉచిత హోమ్ పికప్, డ్రాప్, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కూడా ఉన్నాయి. ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ యజమానులు నాన్ యాక్సిడెంటల్, నాన్ ఇన్సూరెన్స్ కేసులకు రీప్లేస్‌మెంట్ల సేవలను ఉచింతంగా పొందవచ్చు.

ఓలా కేర్‌ ప్లస్‌ ఇలా
ప్రత్యేకంగా, ఓలా కేర్ ప్లస్‌లో.. ఒక సంవత్సరం పాటు స్కూటర్ ఇన్‌స్పెక్షన్‌, ఉచిత లేబర్ ఆన్ సర్వీస్, థెఫ్ట్ అసిస్టెన్స్, హెల్ప్‌లైన్, రోడ్‌సైడ్ అసిస్టెన్స్ ఉన్నాయి. ఓలా కేర్‌ ప్లస్‌  (Ola Care+) ప్లాన్ వార్షిక సమగ్ర రోగనిర్ధారణ, ఉచిత హోమ్ సర్వీస్, పికప్/డ్రాప్ సౌకర్యంతో పాటు ఒకవేళ ప్రమాదం (యాక్సిడెంట్‌) జరిగితే 24×7 డాక్టర్, అంబులెన్స్ సర్వీసులను ఓలా కేర్ + ప్లాన్ ద్వారా ఉపయోగించుకోవచ్చు. ఎక్కడికైనా వెళ్లినప్పుడు అర్ధాంతరంగా స్కూటర్ ఆగిపోతే, టోయింగ్ చేయాల్సి వచ్చినప్పుడు ఉచితంగా టాక్సీ రైడ్‌ సర్వీస్ పొందవచ్చు. నగరం వెలుపల బైక్‌ రిపేర్‌ వచ్చి ఆగిపోతే ఉచిత హోటల్ వసతి పొందవచ్చు.

ఓలా చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ అన్షుల్ ఖండేల్వాల్ మాట్లాడుతూ, “కస్టమర్లకు ఎల్లప్పుడూ మెరుగైన సేవలు అందించడమే మా లక్ష్యం. ‘ఓలా కేర్ సబ్‌స్క్రిప్షన్ ప్లాన్’ ద్వారా, మేము కస్టమర్ సర్వీస్ అనుభవాన్ని పూర్తిగా పునర్నిర్మిస్తున్నాం. సబ్‌స్క్రిప్షన్ ప్లాన్ కస్టమర్‌లకు మా సర్వీస్ నెట్‌వర్క్‌కు 360 డిగ్రీల యాక్సెస్‌ను అందిస్తుంది, ఈ సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ ద్వారా కంపెనీ కస్టమర్‌లకు సర్వీస్‌లను వారి ఇంటి వద్ద లేదా సమీపంలోని ఓలా ఎక్స్‌పీరియన్స్ సెంటర్లలో అందించనుందన్నారు.

చదవండి: నమ్మలేకపోతున్నా.. ఇంటర్వ్యూ చేస్తుండగానే ఉద్యోగం ఊడింది

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు