Ola Electric: ఎలక్ట్రిక్‌ వాహన కొనుగోలుదారులకు గుడ్‌ న్యూస్‌ చెప్పిన ఓలా..!

20 Nov, 2021 16:57 IST|Sakshi

ఎలక్ట్రిక్‌ వాహన కొనుగోలుదారులకు ఓలా ఎలక్ట్రిక్‌ గుడ్‌న్యూస్‌ను చెప్పింది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో నవంబర్‌ 10 నుంచి ఓలా ఎలక్ట్రిక్‌ బైక్లను టెస్ట్‌ రైడ్‌కు అందుబాటులో ఉంచిన విషయం తెలిసిందే. ఈ టెస్ట్‌ డ్రైవ్‌ కేవలం ఎంపిక చేయబడిన మెట్రో పాలిటన్‌ నగరాల్లోనే అందుబాటులోనే ఉన్నాయి. ప్రస్తుతం ఓలా బైక్ల టెస్ట్‌ డ్రైవ్‌ ఢిల్లీ, అహ్మదాబాద్‌, కోల్‌కత్తా నగరాలకే పరిమితమైంది.

నవంబర్‌ 19 నుంచి ముంబై, చెన్నై, హైదరాబాద్‌, కొచ్చి, పుణే నగరాల్లో టెస్ట్‌ రైడ్‌ను ఓలా ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఓలా ఎలక్ట్రిక్‌ బైక్లను విస్తరించడం కోసం ఈ నెలాఖరులో మరిన్ని నగరాలకు తన ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం టెస్ట్ రైడ్ లొకేషన్‌లను విస్తరించే ప్రణాళికలను ఓలా ప్రకటించింది.  నవంబర్‌ 27 నుంచి మరిన్ని నగరాల్లో టెస్ట్‌ రైడ్లను అందుబాటులో ఉంచనుంది. ఓలా ఎస్‌1, ఓలా ఎస్‌1 ప్రో ఎలక్ట్రిక్ బైక్లను సూరత్, తిరువనంతపురం, కోజికోడ్, విశాఖపట్నం, విజయవాడ, కోయంబత్తూర్, వడోదర, భువనేశ్వర్, తిరుప్పూర్, జైపూర్ , నాగ్‌పూర్ నగరాల్లో టెస్ట్‌ రైడ్‌ అందుబాటులో రానుంది. 
చదవండి: ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌కే కాదండోయ్‌..ఈవీ ఇళ్లకూ భారీగా డిమాండ్‌ పెరిగింది..!

వెయ్యి నగరాలకు పైగా..!
ఓలా ఎలక్ట్రిక్‌ బైక్లపై వస్తోన్న స్పందనపై ఓలా ఎలక్ట్రిక్‌ సీఈఓ భవీష్‌ అగర్వాల్‌ హర్షం వ్యక్తం చేశారు. అందుకు సంబంధించిన వీడియోను భవీష్‌ ట్విటర్‌లో షేర్‌ చేశారు. ఓలా ఎలక్ట్రి​క్‌ బైక్లను మరింత విస్తరించేందుకుగాను దేశవ్యాప్తంగా డిసెంబర్‌ 15 నాటికి  సుమారు 1000పైగా నగరాల్లో టెస్ట్‌ డ్రైవ్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తామని ట్విటర్‌లో పేర్కొన్నారు.  
 

ఓలా ఎలక్ట్రిక్‌ బైక్లను  ఆగస్టు 15న  ఓలా ఎస్1, ఎస్ 1ప్రో అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను వరుసగా రూ.99,999, రూ.1,29,999కు లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఓలా ఎలక్ట్రిక్ ఎలక్ట్రిక్ స్కూటర్ల ప్రీ లాంచ్ బుకింగ్ లను జూలైలో ₹499కు ప్రారంభించింది. అప్పుడు కేవలం 24 గంటల్లో లక్ష ఆర్డర్లను అందుకొని రికార్డులను క్రియోట్‌ చేసింది.
చదవండి:  ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌లో ఎన్నిరకాలున్నాయో మీకు తెలుసా?

మరిన్ని వార్తలు