-

ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌.. టెస్ట్‌ రైడ్‌కి మీరు సిద్ధమా?

13 Nov, 2021 15:09 IST|Sakshi

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ సరికొత్త మార్కెటింగ్‌ టెక్నిక్‌తో వినియోగదారులను అకట్టుకోవాలని ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా దేశవ్యాప్తంగా టెస్ట్‌ రైడ్‌ నిర్వహింస్తోంది.

ఈవీలకు డిమాండ్‌
పెరుగుతున్న పెట్రోలు ధరలతో సామాన్యులు చుక్కలు చూస్తున్నారు. ముఖ్యంగా టూ వీలర్‌ సెగ్మెంట్‌లో పెట్రోలు బాధలు తప్పించే ఎలక్ట్రిక్‌ స్కూటర్ల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇందుకు తగ్గట్టే ఇ స్కూటర్‌ తయారీలో అనేక స్టార్టప్‌ కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. వీటన్నింటీలో దేశవ్యాప్తంగా ఎక్కువ మంది దృష్టిని ఓలా ఈ స్కూటర్లు ఆకర్షించాయి.

ఆగస్టులోనే
ఆగస్టులో ఓలా సంస్థ ఓలా ఎస్‌ 1, ఓలా ఎస్‌ ప్రో మోడళ్లను ఆవిష్కరించింది. ఆ తర్వాత నెల తర్వాత బుకింగ్‌ ప్రారంభించింది. ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకుని విడతల వారీగా నగదు చెల్లించినవారికి ఈ స్కూటర్‌ణి  హోం డెలివరీ చేస్తామని తెలిపింది. అయితే ఓలా అందిస్తున్న ఇ స్కూటర్ల ప్రారంభ ధర లక్ష రూపాయల నుంచి రూ.1.32 లక్షల వరకు ఉంది. దీంతో ప్రారంభంలో ఆసక్తి చూపిన అనేక మంది ఆ తర్వాత వెనకడుగు వేశారు. మార్కెట్‌లోకి స్కూటర్‌ వచ్చిన తర్వాత బుకింగ్‌ చేద్దామనే ఆలోచణలో ఎక్కువ మంది ఉన్నారు.

మౌత్‌టాక్‌
ఓలా ‍స్కూటర్లు ప్రీ బుకింగ్‌లో ప్రపంచ రికార్డు సృష్టించగా ఆ తర్వాత ఆ స్థాయిలో బుకింగ్స్‌ నమోదు కాలేదు. దీంతో వినియోగదారులకు మరింర చేరువగా స్కూటర్‌ని తీసుకెళ్లాలని ఓలా నిర్ణయించింది. దీని కోసం దేశవ్యాప్తంగా ఉచితంగా టెస్ట్‌ డ్రైవ్ చేసే అవకాశం కల్పిస్తోంది. టెస్ట్‌ ట్రైవ్‌ జరిగితే స్కూటర్‌ పనితీరు పట్ల పాజిటివ్‌ మౌత్‌టాక్‌ వస్తుందని.. తద్వారా రెండో విడత అమ్మకాలు జోరందుకుంటాయని సంస్థ అంచనా వేస్తోంది.

హైదరాబాద్‌లో
ఇప్పటికే బెంగళూరు, కోలక్‌తా, అహ్మదాబాద్‌, నేషనల్‌ క్యాపిటర్‌ రీజియన్‌ (ఢిల్లీ)లో టెస్ట్‌ డ్రైవ్‌ను ప్రారంభించారు. కస్టమర్లకి బైకు ప్రత్యేకతలు, ఫీచర్లు వివరిస్తూ టెస్ట్‌డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. నవంబరు 19 తర్వాత ముంబై, హైదరాబాద్‌, చెన్నై నగరాల్లో టెస్ట్‌ డ్రైవ్‌కి అవకాశం కల్పించనున్నారు.

చదవండి: ఈవీ మార్కెట్లోకి కొత్త ఎలక్ట్రిక్ బైక్.. రేంజ్ కూడా అదుర్స్!

మరిన్ని వార్తలు