Ola Electric Scooter: ఓలా ఎలక్ట్రిక్‌ బైక్‌.. ఫీచర్లపై అంచనా.. ధర అంత ఉండొచ్చు!

14 Aug, 2021 12:07 IST|Sakshi

Ola Electric Scooter: ఎలక్ట్రిక్‌ వెహకిల్స్‌ బుకింగ్‌లో సరికొత్త రికార్డ్‌లను క్రియేట్‌ చేసిన ఓలా బైక్‌.. విడుదలకు సిద్ధమైంది. ఆగస్ట్‌ 15 మధ్యాహ్నం 2 గంటలకు విడుదల కానుంది. వారి ఆసక్తిని రెట్టింపు చేసేలా కొన్ని ఆసక్తికరమైన ఫీచర్స్‌ను ఓలా కంపెనీ రివీల్‌ చేసింది కూడా. ఇప్పుడు అదనంగా బైక్‌ ఫీచర్స్‌కు సంబంధించిన విషయాలు కొన్ని తెలుసుకుందాం!(అంచనాలు మాత్రమే).    

వెయ్యి పట్టణాల్లో.. కేవలం 24 గంటల్లో లక్ష ప్రి బుకింగ్‌తో ఆటోమొబైల్‌ ఇండస్ట్రీని పరుగులు పెట్టేలా చేసింది ఓలా. ఈ ఈ-బైక్‌ అనౌన్స్‌మెంట్‌ తర్వాత మరికొన్ని కంపెనీలు ఎలక్ట్రిక్‌ బైక్‌లను మార్కెట్‌లోకి తెచ్చే పనిని మొదలుపెట్టాయి. ఇప్పటికే హీరో ఎలక్ట్రిక్‌ ప్రకటన చేయగా.. సింపుల్ వన్ కంపెనీ ఏకంగా ప్రి బుకింగ్‌ మొదలుపెట్టింది. అయితే మిగిలిన టూవీలర్స్‌ సంగతి ఎలా ఉన్నప్పటికీ.. ఓలాకి మాత్రం జనాల్లో మంచి క్రేజ్‌ ఏర్పడింది. అందుకే రిలీజ్‌ కాబోయే కొద్ది గంటల ముందు కూడా ఫీచర్స్‌, స్పెసిఫికేషన్స్‌ గురించి ఆరాలు తీస్తున్నారు. 

ఒక్క సారి ఛార్జింగ్‌ పెడితే ఎన్నికిలోమీటర్లు వస్తుంది?
'ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ముందుకే కాదు వెనక్కి కూడా ప్రయాణిస్తాయి. స్మార్ట్‌ఫోన్‌లోని అప్లికేషన్ సహాయంతో స్కూటర్‌ను యాక్సెస్ చేయవచ్చని' ఓలా సీఈఓ భవీష్‌ అగ్వరాల్‌ ఇదివరకే ప్రకటించారు. తాజాగా ఆ బైక్‌కు సంబంధించిన కొన్ని ఫీచర్ల గురించి లీకులు అందుతున్నాయి. ఓలా బైక్‌ ఒక్కసారి ఫుల్‌ ఛార్జింగ్‌ పెడితే  150 కిలోమీటర్ల దూరం వరకు ప్రయాణించొచ్చనే ప్రచారం నడుస్తున్నప్పటికీ.. కంపెనీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అలాగే ఫుల్‌ ఛార్జింగ్‌ కోసం ఎన్ని గంటలు పడుతుందనేదానిపై  క్లారిటీ రావాల్సి ఉంది.  

పొడవు,వెడల్పు, బరువెంత?
ఓలా ఎలక్ట్రిక్‌ బైక్‌ పొడవు 1,860 మిల్లీమీటర్ల పొడవు ఉండగా వెడల్పు 700 మిల్లీ మీటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఎత్తు 1,155 మిల్లీ మీటర్లు ఉండనుంది. వీల్‌బేస్ 1,345 మిల్లీ మీటర్లు ఉండగా.. బరువు  74 కిలోలు ఉండే ఛాన్స్‌ ఉంది.

ఓలా బైక్‌ బ్యాటరీ సామర్ధ్యం ఎంత?
బైక్‌ 3.4kWh బ్యాటరీ సామర్థ్యాన్ని కలిగి ఉండొచ్చు.   

ఓలా ఎలక్ట్రిక్‌ బైక్‌ స్పీడ్‌ ఎంత?
స్కూటర్ 4.5 సెకన్లలో గరిష్టంగా 45 కిలోమీటర్ల వేగం అందుకోవచ్చని, టాప్‌ స్పీడ్‌ గంటకు వంద కిలోమీటర్ల వేగం ఉండొచ్చు. 

ఓలా బైక్‌కు సబ్సీడీ? 
2019లో ఫేమ్‌-2 ఫథకం కింద కేంద్రం ఎలక్ట్రిక్‌ వాహనాలపై సబ్సీడీ అందిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. మినిమం రేంజ్‌ 80 కిలోమీటర్లు, టాప్‌ స్పీడ్‌ 40కిలోమీటర్ల వేగం ఉన్న బైక్ లకు సబ్సీడీ వర్తిస్తుంది. సబ్సీడీ కింద కీలో మీటర్‌ కేడబ్ల్యూహెచ్‌(kilowatt hour )కి రూ.10వేలు ఇస్తున్నట్లు గతంలో ప్రకటించిన కేంద్రం... ఆ సబ్సీడీని సవరించి 50శాతం అంటే కిలో మీటర్‌ కేడబ్ల్యూహెచ్‌కి రూ.15వేలు ఇస్తున్నట‍్లు తెలిపింది. మరి ఆ సబ్సీడీ ఓలా బైక్‌కు వర్తిస్తుందా? లేదా అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది.   

బైక్‌ ధర ఎంత ఉండొచ్చు?
ఆగష్టు 15నే  ఓలా ఎలక్ట్రిక్‌ బైక్‌ ధర వెలుగులోకి రానుండగా.. ఎక్స్‌షోరూం ధర లక్షా 20 వేల నుంచి లక్షా 30 వేల మధ్య  ఉండొచ్చని ఆటోమొబైల్స్‌ నిపుణులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు