Ola Electric: మరో సంచలనానికి తెర తీయనున్న ఓలా ఎలక్ట్రిక్‌...!

21 Aug, 2021 19:47 IST|Sakshi

ఎలక్ట్రిక్‌ వాహన రంగంలో ఓలా తన ఎలక్ట్రిక్‌ బైక్స్‌ను భారత మార్కెట్లలోకి రిలీజ్‌ చేసి సంచలనం సృష్టించింది తాజాగా ఓలా ఎలక్ట్రిక్‌ అదే ఒరవడిలో మరో సంచలనానికి కూడా తెర తీయనుంది. ఓలా ఎలక్ట్రిక్‌ నుంచి బైక్లనే కాకుండా భవిష్యత్తులో ఎలక్ట్రిక్‌ కార్లను కూడా రిలీజ్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. ఓలా కో ఫౌండర్‌ భవీష్‌ అగర్వాల్‌ ఎలక్ట్రిక్‌ కార్లకు సంబంధించి ట్విటర్‌లో ఓ నెటిజన్‌ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఓలా ఎలక్ట్రిక్‌ కార్లను మార్కెట్లలోకి లాంచ్‌ అయ్యే సంవత్సరాన్ని వెల్లడించారు.

చదవండి: Gautam Adani : గౌతమ్‌ అదానీకి భారీ షాక్‌..!

ట్విటర్‌లో ఓ నెటిజన్‌ భవీష్‌ అగర్వాల్‌ను ట్యాగ్‌ చేస్తూ మీకు ఉన్న కారు డీజిలా..పెట్రోలా లేక ఎలక్ట్రిక్‌ కారా అని అడగ్గా భవీష్‌ అగర్వాల్‌ ట్విట్‌కు రిప్లే ఇస్తూ..రెండు నెలల క్రితం వరకు నాకు కారు లేదు. ఇప్పుడు హైబ్రిడ్‌ కారు ఉంది. తరువాత 2023లో ఎలక్ట్రిక్‌ కారు...అది కూడా ఓలా ఎలక్ట్రిక్‌ కారు..’అని రిప్లే ఇచ్చాడు. దీంతో ఓలా నుంచి వచ్చే ఎలక్ట్రిక్‌ కారు ముహూర్తం ఫిక్స్‌ అయ్యింది.

తాజాగా ఓలా కో ఫౌండర్‌ భవీష్‌ అగర్వాల్‌ భారతదేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఎస్1ను ఘనంగా లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. కొన్ని వారాల క్రితం కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం ప్రీ బుకింగ్స్ చేసుకోవచ్చు అని చెప్పగానే 24 గంటల్లో లక్షకు పైగా ఆర్డర్లు వచ్చాయి. దీంతో ఓలా ఎలక్ట్రిక్ ప్రపంచ స్థాయిలో రికార్డు సృష్టించింది.

(చదవండి: Elon Musk-Jeff Bezos: ఎలన్‌ మస్క్‌కు పెద్ద దెబ్బే కొట్టిన జెఫ్‌బెజోస్‌...!)

మరిన్ని వార్తలు