Ola Electric Car: ఓలా ఎలక్ట్రిక్ కారు.. ఒక్క చార్జింగ్‌తో 500 పైగా కిలోమీటర్లు!

13 Aug, 2022 18:11 IST|Sakshi

ముంబై: ఇండియన్‌ మల్టీనేషన్‌ రైడ్‌ షేరింగ్‌ కంపెనీ ఓలా మరో సంచలనానికి సిద్ధమవుతోంది. భారత స్వాతంత్ర్య వజ్రోత్సవాలను పురస్కరించుకుని ఫోర్‌ వీలర్‌ ఎలక్ట్రిక్ వెహికిల్‌ను ఆవిష్కరించనుంది. ఆగస్టు 15న స్పోర్టియస్ ఎలక్ట్రిక్ కారుతో పాటు స్కూటర్‌ను కూడా కొత్తగా మార్కెట్‌లోకి ప్రవేశపెట్టనుంది.


ఓలా ఆవిష్కరించనున్న స్పోర్టీ ఎలక్ట్రిక్ కారుకు సంబంధించి ఆసక్తికరమైన అప్‌డేట్‌ ఒకటి వెలుగులోకి వచ్చింది. ఒకసారి చార్జింగ్‌ చేస్తే ఏకంగా 500 కిలోమీటర్లు పైగా ప్రయాణిస్తుందని సమాచారం. ఇందుకోసం మెరుగైన ఆధునాతన బ్యాటరీలను వాడుతున్నారని తెలిసింది. లేటెస్ట్‌ టెక్‌ ఫీచర్లతో అత్యుత్తమంగా స్పోర్టియస్ ఎలక్ట్రిక్ కారు ఉంటుందని కంపెనీ వర్గాలు వెల్లడించినట్టు ‘కార్‌ అండ్‌ బైక్‌’ వెల్లడించింది. (క్లిక్: Swift S-CNG వచ్చేసింది.. ఫీచర్లు చూసి వావ్‌ అనాల్సిందే!)


కాగా, తమ తాజా ఆవిష్కరణలకు సంబంధించి ఓలా సీఈవో భవీష్‌ అగర్వాల్‌ సోషల్‌ మీడియా ద్వారా వినూత్నంగా ప్రచారం సాగిస్తున్నారు. ఆగస్టు 15న తాము ఏం ఆవిష్కరించబోతున్నామో ఊహించగలరా అంటూ ట్విటర్‌లో పోల్‌ కూడా పెట్టారు. స్పోర్టియస్ ఎలక్ట్రిక్ కారు లాంచ్‌ చేయబోతున్నారని ఎక్కువ మంది నెటిజన్లు అభిప్రాయపడ్డారు. తక్కువ రేటుతో కొత్త ఎస్‌1 తెస్తున్నారని మరికొంత మంది పేర్కొన్నారు. ఓలా సెల్‌ ఫ్యాక్టరీ, సరికొత్త కలర్‌లో ఎస్‌1 ఆవిష్కరిస్తారని ఇంకొందరు ఊహించారు. (క్లిక్: కియా మరోసారి అదరగొట్టింది)

మరిన్ని వార్తలు