Ola Electric Vehicles : ఏడాది కోటి ఎలక్ట్రిక్ బైక్స్‌ తయారీకి సర్వం సిద్ధం

13 Jul, 2021 08:34 IST|Sakshi

న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాల తయారీకి సంబంధించి భారీ ప్రణాళికలతో ఉన్న ఓలా ఎలక్ట్రిక్‌ 100 మిలియన్‌ డాలర్ల (రూ.744 కోట్లు) దీర్ఘకాలిక రుణాన్ని బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా నుంచి తీసుకునేందుకు ఒప్పందం చేసుకుంది. ఓలా రూ.2,400 కోట్లతో మొదటి విడత ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహన తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్టు గతేడాది డిసెంబర్‌లోనే ప్రకటించింది. తాజాగా సమీకరించనున్న రుణాన్ని ఇందుకోసం వినియోగించనున్నట్టు తెలిపింది.

తమిళనాడులో 500 ఎకరాల్లో ‘ఫ్యూచర్‌ ఫ్యాక్టరీ’ పేరుతో ఓలా నిర్మిస్తున్న అతిపెద్ద ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహన తయారీ కేంద్రం త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభించనుంది. ఈ కేంద్రం ఏటా కోటి వాహనాలను తయారు చేసే సామర్థ్యంతో ఉంటుంది. దీన్ని అంతర్జాతీయ తయారీ కేంద్రంగా ఓలా ఎలక్ట్రిక్‌ పరిగణిస్తోంది. ‘ఓలా, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా మధ్య కుదిరిన దీర్ఘకాల రుణ ఒప్పందం.. ప్రపంచంలోనే అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీ ప్లాంట్‌ను రికార్డు సమయంలోనే ఏర్పాటు చేయాలన్న మా ప్రణాళికల పట్ల రుణ దాతల్లో నమ్మకానికి నిదర్శనం. ప్రపంచానికి మేడిన్‌ ఇండియా ఎలక్ట్రిక్‌ వాహనాలను అందించాలన్న ప్రణాళికకు కట్టుబడ్డాం’ అని ఓలా చైర్మన్, గ్రూపు సీఈవో భవీష్‌ అగర్వాల్‌ పేర్కొన్నారు. 

చదవండి వెయ్యి టన్నులా, బంగారం కొనుగోళ్లపై సెంట్రల్‌ బ్యాంక్‌ల ఫోకస్‌​

మరిన్ని వార్తలు