ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రీ బుకింగ్స్ మళ్లీ ఓపెన్

5 Oct, 2021 18:25 IST|Sakshi

బెంగళూరు: ఓలా ఎలక్ట్రిక్ తన ఈ-స్కూటర్లను బుక్ చేసుకోవడం కోసం మళ్లీ రిజర్వేషన్ విండోను ఓపెన్ చేసింది. ఎస్1, ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్లను రూ.499 ప్రారంభ మొత్తంతో వెబ్ సైట్ ద్వారా బుకింగ్ చేయవచ్చు. గత నెలలో ఈ ఎలక్ట్రిక్ టూ వీలర్ కేవలం రెండు రోజుల్లో రూ.1,100 కోట్ల విలువైన అమ్మకాలు జరిపారు. రెండు రోజుల అమ్మకాల్లో అద్భుతమైన ప్రతిస్పందన రావడంతో బుకింగ్స్ మూసివేసింది. 1000కి పైగా నగరాలు, పట్టణాల నుంచి స్కూటర్ బుక్ చేసుకున్న వినియోగదారులకు ఈ ఏడాది అక్టోబర్ నెల చివరి నుంచి కంపెనీ డెలివరీ చేయడం ప్రారంభించనున్నట్లు తెలిపింది.

అలాగే, ఓలా ఎలక్ట్రిక్ నవంబర్ 1న మళ్లీ బుకింగ్స్ ఓపెన్ చేయాలని భావించింది. కానీ, తాజాగా మరోసారి బుకింగ్స్ ఓపెన్ చేసింది. ఈ-స్కూటర్ ను ఓలా యాప్, వెబ్ సైటు ద్వారా సులభంగా బుక్ చేసుకోవచ్చు. తన ఎలక్ట్రిక్ స్కూటర్ మొదటి 24 గంటల్లోరికార్డు స్థాయిలో 1,00,000 మందికి పైగా బుక్ చేసినట్లు, ప్రపంచంలోనే తక్కువ భారీగా బుక్ చేసిన ఎలక్టరీ స్కూటర్ గా నిలిచినట్లు సంస్థ జూలైలో ప్రకటించింది. ఓలా కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఆగస్టు 15న ఓలా ఎస్1, ఎస్1 ప్రో అనే రెండు వేరియెంట్లలో లాంఛ్ చేసింది.(చదవండి: ఈ టాటా గ్రూప్ లింకుపై క్లిక్ చేశారో ఇక అంతే సంగతులు)

ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్లను ఎస్‌ 1, ఎస్‌ 1 ప్రో అంటూ రెండు వేరియంట్లలో అందిస్తున్నారు. వీటిలో 8.5 కిలోవాట్‌ మోటార్‌, 3.97 కిలోవాట్‌ పర్‌ అవర్‌ ‍బ్యాటరీని అమర్చారు. గరిష్ట వేగం గంటకు 90 నుంచి 115 కిలోమీటర్లుగా ఉంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 121 నుంచి 180 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు, కేవలం మూడు సెకన్లలో 40 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకోగలదు. ఇందులో ఎస్‌ 1 ధర రూ. 99,999లుగా ఉండగా ఎస్‌ 1 ప్రో ధర రూ.1,29,000లుగా ఉన్నాయి. ఓలా స్కూటర్‌ పది రంగుల్లో లభిస్తోంది.


 

మరిన్ని వార్తలు