Ola Electric Scooter: కొనుగోలు దారులకు ఓలా ఎలక్ట్రిక్‌ భారీ షాక్‌,లబోదిబోమంటున్న కస్టమర్లు!

12 Jan, 2022 12:34 IST|Sakshi

ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ వినియోగదారులకు భారీ షాక్‌ తగిలింది. ఓలా ఎస్‌1, ఎస్‌1 ప్రో ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో కొనుగోలు దారులు ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ సంస్థ ఓలాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

కొనుగోలుదారులు ఎన్నోరోజుల నిరీక్షణ తర్వాత ఎలక్ట్రిక్‌ వెహికల్‌ సంస్థ ఓలా గత డిసెంబర్‌ నెలలో స్కూటర్‌ డెలివరీలను ప్రారంభించింది. అయితే తాజాగా ఓలా డెలివరీ చేసిన ఎస్‌1,ఫీచర్లలలో సాంకేతిక లోపాలు తలెత్తాయి. ముఖ్యంగా క్రూయిస్‌ కంట్రోల్‌, హిల్‌ హోల్డ్‌, నేవిగేషన్‌ అసిస్ట్‌, హైపర్‌ మోడ్‌'లలో సాఫ్ట్‌వేర్‌ లోపాలతో స్కూటర్‌ పని తీరు కొనుగోలు దారులు ఆశించిన స్థాయిలో లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 

ఈ నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్‌ చీఫ్‌ మార్కెటింగ్‌ ఆఫీసర్‌ వరుణ్‌ దూబే స్పందించారు. ఎలక్ట్రిక్‌ స్కూటర్‌లలో సాఫ్ట్‌వేర్‌లను మూడు నెలల నుంచి ఆరు నెలల మధ్య కాలంలో అప్‌డేట్‌ చేస్తామని హామీ ఇచ్చారు. “క్రూయిజ్ కంట్రోల్, హిల్ హోల్డ్, నావిగేషన్ వంటి ఫీచర్లు వచ్చే కొద్ది నెలల్లో జూన్ నాటికి అందుబాటులోకి రానున్నాయి”అని వరుణ్ దూబే అన్నారు. అంతేకాదు సాంకేతిక లోపం తలెత్తిన ఫీచర్ల సాఫ్ట్‌వేర్‌లను అప్‌డేట్‌ చేయడంతో పాటు మరిన్ని ఫీచర్లను అందుబాటులోకి తెస్తామని చెప్పారు.  అంటే ఈ ఆరు నెలల పాటు ఈ ఫీచర్లు లేకుండానే వినియోగదారులు తమ స్కూటర్లను ఉపయోగించాల్సి ఉంటుంది.

చదవండి: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ రియల్ రేంజ్ ఇంతేనా..? 

మరిన్ని వార్తలు