-

ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో ఓలా ఎలక్ట్రిక్ రికార్డు

16 Sep, 2021 16:28 IST|Sakshi

ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాల్లో ఓలా ఎలక్ట్రిక్ రికార్డు సృష్టించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనల బుకింగ్స్ పరంగా ఓలా ఎలక్ట్రిక్ రికార్డు నెలకొల్పిన సంగతి మనకు తెలిసిందే. ఓలా స్కూట‌ర్‌ను రూ.499 టోకెన్ మొత్తాన్ని చెల్లించి బుక్ చేసుకోవ‌చ్చు. ఈ స్కూట‌ర్‌ని రిజ‌ర్వ్ చేసుకున్న వినియోగదారులు మిగిలిన మొత్తాన్ని చెల్లించి స్కూటర్ కొనుగోలు చేయవచ్చు. అయితే, నిన్న(సెప్టెంబర్ 15న) విక్రయాలు ప్రారంభించిన తొలి రోజులోనే రికార్డు స్థాయి అమ్మకాలు జరిపింది. అమ్మకాలు మొదలుపెట్టిన ఒక్కరోజులో రూ.600 కోట్లకు పైగా విలువైన స్కూటర్లను విక్రయించినట్లు సంస్థ వెల్లడించింది. 

ఇంతకముందు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ బుక్ చేసుకున్న వినియోగదారులు స్కూటర్లను కొనుగోలు చేయాలని సంస్థ పేర్కొంది. ఈ స్కూటర్ అమ్మకాలు నేటి(సెప్టెంబర్ 16) అర్థరాత్రితో ముగిస్తామని ప్రకటించింది. ఈ విషయాన్ని ఓలా తన బ్లాగ్ పోస్టులో పేర్కొంది. అమ్మకాలు ప్రారంభించినప్పటి నుంచి పీక్ సమయంలో సెకనుకు కంపెనీ నాలుగు స్కూటర్లను విక్రయిస్తున్నట్లు ఓలా ఎలక్ట్రిక్ అగర్వాల్ బుధవారం రాత్రి ప్రకటించారు. అగర్వాల్ ఒక బ్లాగ్ పోస్టులో ఒకే రోజు అమ్మకాల పరిమాణాలు, విలువ పరంగా 'మొత్తం ద్విచక్ర పరిశ్రమ ఒక రోజులో విక్రయించే దానికంటే ఎక్కువ' అని హైలైట్ చేశారు.(చదవండి: పండుగ సీజన్​ రాకముందే ఎస్​బీఐ ఆఫర్ల వర్షం!)

స్కూటర్‌ ఫీచర్స్‌
ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్లను ఎస్‌ 1, ఎస్‌ 1 ప్రో అంటూ రెండు వేరియంట్లలో అందిస్తున్నారు. వీటిలో 8.5 కిలోవాట్‌ మోటార్‌, 3.97 కిలోవాట్‌ పర్‌ అవర్‌ ‍బ్యాటరీని అమర్చారు. గరిష్ట వేగం గంటకు 90 నుంచి 115 కిలోమీటర్లుగా ఉంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 121 నుంచి 180 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చు, కేవలం మూడు సెకన్లలో 40 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకోగలదు. ఇందులో ఎస్‌ 1 ధర రూ. 99,999లుగా ఉండగా ఎస్‌ 1 ప్రో ధర రూ.1,29,000లుగా ఉన్నాయి. ఓలా స్కూటర్‌ పది రంగుల్లో లభిస్తోంది.
 

మరిన్ని వార్తలు