ఓలా కార్స్‌.. నడిపి చూడండి .. నచ్చితేనే కొనండి !

4 Sep, 2021 18:56 IST|Sakshi

ఎలక్ట్రిక్‌ స్కూటర్‌తో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన ఓలా మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సెకండ్‌ హ్యాండ్‌ కార్ల మార్కెట్‌లోకి అడుగు పెట్టాలని నిర్ణయించింది. అందుకోసమని కొత్తగా ఓలా కార్స్‌ను ప్రారంభించింది.

ట్రై అండ్‌ బయ్‌
సెకండ్‌ హ్యాండ్‌ కార్ల కొనుగోలు అమ్మకం విభాగంలోకి ఓలా ప్రవేశించింది. ఈ మేరకు ఓలా కార్స్‌ సంస్థను ప్రారంభించింది. ట్రయ్‌ అండ్‌ బయ్‌ నినాదంతో మార్కెట్‌లో ఎక్కువ వాటా పొందేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సెకండ్‌ హ్యాండ​ కారును నడిపి చూసి సంతృప్తి చెందితేనే కొనండి అంటూ ఓలా కస్టమర్లకు ఆహ్వానం పలుకుతోంది

సెకండ్‌కి పెరుగుతున్న డిమాండ్‌
కరోనా సంక్షోభం తర్వాత పబ్లిక్‌ ట్రా‍న్స్‌పోర్ట్‌ కంటే వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణాలకు డిమాండ్‌ పెరిగింది. షోరూమ్‌ ధరకు కార్లను కొనుగోలు చేయలేని వారు, కొత్తగా కార్లు తీసుకోవాలనుకునే వారు సెకండ్‌ హ్యాండ్‌ మార్కెట్‌ని ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం మన దేశంలో సెకండ్‌హ్యాండ్‌ కార్ల మార్కెట్‌ విలువ 18 బిలియన్‌ డాలర్లు ఉండగా 2030 నాటికి 70 బిలియన్‌ డాలర్లకు చేరుకోవచ్చని మార్కెట్‌ రీసెర్చ్‌ సంస్థ పీ అండ్‌ ఎస్‌ అంచనా వేసింది. దీంతో ఈ రంగంలో పట్టు కోసం ఓలా తన వంతు ప్రయత్నాలు ప్రారంభించింది.

ఓలాకి సచిన్‌ దన్ను
గత కొంత కాలంగా మార్కెట్‌లో ఓలా దూకుడు ప్రదర్శిస్తోంది. ఫ్లిప్‌కార్ట్‌ ఫౌండర్‌ సచిన్‌ బన్సాల్‌ ఓలాలో పెట్టుబడులు పెట్టారు. మరోవైపు ఓలా ఫౌండర్‌ భవీష్‌ అగర్వాల్‌ దూకుడు తోవడంలో ఓలా స్టార్టప్‌ నుంచి బ్రాండ్‌గా ఎదుగుతోంది. ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ అయితే ఇటీవల కాలంలో సంచలనమే సృష్టించింది. ఏకంగా ఏడాదికి పది కోట్ల యూనిట్ల స్కూటర్లు తయారు చేసేలా ఫ్యాక్టరీని నిర్మిస్తున్నారు. 

చదవండి : ఐపీఓకి ఓలా,వేల కోట్ల నిధుల సమీకరణ లక్ష్యంగా సన్నాహాలు

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు