ఇంకోసారి, వందల మంది ఉద్యోగుల్ని తొలగించిన ఓలా!

13 Jan, 2023 13:10 IST|Sakshi

రైడ్‌ షేరింగ్‌ సంస్థ ఓలా కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థకు చెందిన అన్నీ విభాగాలకు చెందిన ఉద్యోగుల్లో సుమారు 200 మందిని ఫైర్‌ చేసింది. సంస్థ పునర్నిర్మాణం పేరుతో గతేడాది 1100 మంది ఉద్యోగుల్ని ఇంటికి పంపిన ఓలా.. తాజాగా మరోసారి ఉద్యోగుల్ని ఇంటికి సాగనంపేందుకు శ్రీకారం చుట్టుంది.   

ఐఎన్‌సీ 42 నివేదికల ప్రకారం.. ఓలా సంస్థ నిర్వహిస్తున్న కార్యకలాపాల్లోని ఓలా క్యాబ్స్‌, ఓలా ఎలక్ట్రిక్‌ 200 మంది ఉద్యోగులకు పింక్‌ స్లిప్‌లు జారీ చేసినట్లు తెలుస్తోంది. అయితే గత సెప్టెంబర్ నుంచి ఉద్యోగుల తొలగింపుపై సంస్థ సీఈవో భవిష్‌ అగర్వాల్‌ చర్చిస్తుస్తున్నారని, తాజాగా నిర్ణయం మేరకు ఐటీ ఉద్యోగులపై కంపెనీ వేటు వేసిందని వెలుగులోకి వచ్చినట్లు రిపోర్ట్‌లు హైలెట్‌ చేస్తున్నాయి. ఓలా సైతం ఉద్యోగుల తొలగింపుల్ని ధృవీకరించింది. ఈ అంశంపై ఓలా అధికారి మాట్లాడుతూ.. ‘సామర్థ్యాలను మెరుగుపరుచుకునే క్రమంలో మేము క్రమం తప్పకుండా కంపెనీ పునర్నిర్మాణ చర్యలను తీసుకుంటాం. ఈ నేపథ్యంలో కొందరిని తొలగించడం అదే విధంగా మా ప్రాధాన్యత రంగాలైన ఇంజనీరింగ్ , డిజైన్‌లో కొత్త నియామకాలు జరుగుతుంటాయి. ఈ ప్రక్రియ ప్రతి ఏడాది జరుగుతుందని’ తెలిపారు.

మరిన్ని వార్తలు