ఓలాకి గడ్డు కాలం..వందల మంది ఉద్యోగుల తొలగింపు!

10 Jul, 2022 14:33 IST|Sakshi

ప్రముఖ ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ తయారీ సంస్థ ఓలా కీలక నిర్ణయం తీసుకుంది. నిర్వహణ లోపాలు, ఆర్థిక మాంద్యం దెబ్బకు ఖర్చుల్ని తగ్గించుకునేందుకు వందల మంది ఉద్యోగుల్ని తొలగించనున్నట్లు తెలుస్తోంది.

ఇటీవల బ్యాటరీ లోపాల కారణంగా ఓలా ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ అగ్నికి ఆహుతయ్యాయి. దీంతో వాహనదారులు సైతం ఆ సంస్థ ఈవీ వెహికల్స్‌ను కొనుగోలు చేసేందుకు వెనక్కి తగ్గారు. ఫండింగ్‌ సమస్యలు తలెత్తాయి. వెరసి సంస్థను ఆర్ధిక సమస్యల నుంచి గట్టెక్కించేందుకు ఓలా 500 మంది ఉద్యోగుల్నితొలగించనున్నట్లు  నివేదికలు వెలుగులోకి వచ్చాయి. 

ఇందులో భాగంగా పనితీరును బట్టి ఆయా విభాగాలకు చెందిన ఉద్యోగుల్ని పక్కన పెట్టేస్తున్నట్లు వెలుగులోకి వచ్చిన నివేదికలు పేర్కొన్నాయి. అంతేకాదు పూర్తి స్థాయిలో ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌పై దృష్టిసారించిన ఓలా.. ఆ సంస్థ అనుసంధానంగా ఉన్న ఓలా కేఫ్‌, ఫుడ్‌ పాండా, ఓలా ఫుడ్స్‌,ఓలా డ్యాష్‌లను మూసి వేసింది. 

మరిన్ని వార్తలు