ఓలా..! ఎందుకిలా..! నెలకూడా కాలేదు..అప్పుడే..

16 Apr, 2022 15:09 IST|Sakshi

ఆటోమొబైల్‌ మార్కెట్‌లో వాహనదారుల్ని ఆకట్టుకుంటున్న ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ మనుగడపై నీలినీడలు కమ్ముకుంటున్నాయి. ఇప్పటికే వరుస ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ ప్రమాదాలు కొనుగోలు దారుల్ని ఆందోళన  గురిచేస్తుండగా.. తాజాగా ఓలా ఎలక్ట్రిక్‌ వెహికల్‌ బ్రేకులు ఫెయిల్‌ అయ్యాయి. దీంతో ఆ వెహికల్‌ ముందు టైర్‌ పూర్తిగా ఊడిపోయింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్‌ అవుతున్నాయి. 

ఈ ఏడాది మార్చి నెల పూణేలోని లోహెగావ్ ప్రాంతానికి చెందిన ఓ వాహనదారుడి ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ అగ్నికి ఆహుతైంది. ఆ తర్వాత మరో ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ సంస్థ ఒకినావా ఈ- బైక్‌కు మంటలు అంటుకున్నాయి.

ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. ఇప్పుడు మరోసారి ఓలా ఎస్‌1 ప్రో ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ బ్రేకులు ఫెయిలై షేపులు మారిపోయాయి. దీంతో డ్యామేజైన బైక్‌ ముందు టైరు ఫోటోలో చూపించినట్లుగా ముందుకు వచ్చేసింది. ఆ బైక్‌ నడుపుతున్న బాధితుడు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో  సర్క్యులేట్ అవుతున్నాయి. 

కేంద్రం ఏం చేస్తుంది
ఇప‍్పటికే వరుస ప్రమాదాలతో ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ కొనాలంటేనే కొనుగోలు దారులు బెంబేలెత్తిపోతున్నారు. అందుకే వాహనదారుల్లో ఉన్న భయాల్ని పోగొట్టేలా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వెహికల్స్‌ అమ్మకాల్ని ప్రోత్సహిస్తూ ప్రమాదం జరిగిన ఎలక్ట్రిక్‌ వెహికల్‌ తయారీ సంస్థలపై దర్యాప్తు చేయడానికి స్వతంత్ర నిపుణుల బృందాన్ని నియమించింది.

చదవండి: కాలిపోతున్న ఎలక్ట్రిక్ స్కూటర్లు..కారణం ఏంటంటే?!

మరిన్ని వార్తలు