ఎలక్ట్రిక్‌ బైక్ నడుపుతున్నారా?.. ఓలా సంస్థ కీలక నిర్ణయం.. ఉచితంగా!

14 Mar, 2023 20:09 IST|Sakshi

ప్రముఖ ఎలక్ట్రిక్‌ సంస్థ ఓలా మరోసారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే ఆ సంస్థకు చెందిన స్కూటర్లలలో సాంకేతిక లోపాలు తలెత్తడంతో పాటు, అగ్నికి ఆహుతైన ఘటనలు వెలుగులోకి వచ‍్చిన విషయం తెలిసిందే. తాజాగా ఎస్‌1 ఈవీ వెహికల్స్‌లో ఫ్రంట్‌ ఫోర్క్‌ ఉన్నట్టుండీ విరిగిపోవడంతో వాహనదారులు స్వల్పంగా గాయపడిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

ఈ తరుణంలో ఓలా సీఈఓ భవిష్‌ అగర్వాల్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫ్రంట్‌ ఫోర్క్‌లో ఏదైనా అసౌకర్యంగా ఉంటే ఫ్రీగా అప్‌గ్రేడ్‌ చేస్తామని అధికారికంగా ప్రకటించారు. మార్చి 22 నుంచి అప్‌ గ్రేడ్‌ ప్రక్రియ ప్రారంభం అవుతుందని తెలిపారు. అపాయింట్‌మెంట్‌ బుక్‌ చేసుకునేందుకు తామే కస్టమర్లను సంప్రదిస్తామని ఓలా తన అధికారిక ప్రకటనలో పేర్కొంది. 

మరిన్ని వార్తలు