New GST Rules: జనవరి 1 నుంచి ఆటో ఎక్కితే మోత మోగాల్సిందే..!

29 Dec, 2021 20:52 IST|Sakshi

కొత్త ఏడాదిలో కేంద్రం ప్రయాణికులకు మరో షాక్ ఇచ్చేందుకు సిద్దం అవుతుంది. ఓలా..ఉబర్ వంటి యాప్ అగ్రిగేటర్ల ద్వారా బుక్ చేసుకునే ఆటో రిక్షా రైడ్‌లు కూడా కొత్త సంవత్సరంలో మరింత ఖరీదైనవిగా మారనున్నాయి. జనవరి 1 నుంచి ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే ఆటో రైడ్‌లపై 5% జీఎస్‌టీని విధించనున్నట్లు గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటి వరకు ఈ కామర్స్ ఆటో రిక్షా బుకింగ్ పై జీఎస్‌టీ మినహాయింపు ఉండేది. దాన్ని ఇప్పుడు కేంద్రం ఉప సంహరించుకుంది.

వీధులలో తిరిగే ఆటో రైడ్‌ల మీద ఎలాంటి జీఎస్‌టీ విధించరు. యాప్ ఆధారిత అగ్రిగేటర్లు ఉబర్, ఓలా, రాపిడో వంటివి ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కేంద్రాన్ని కోరుతూ ప్రకటనలు విడుదల చేశారు. ఈ విషయం మీద తెలంగాణ ఆటో డ్రైవర్ల సంక్షేమ ప్రధాన కార్యదర్శి ఏ.సత్తిరెడ్డి మాట్లాడుతూ.. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఆటో డ్రైవర్లకు వచ్చే బుకింగ్ రైడ్‌లు తగ్గుతాయని అన్నారు. ఇప్పటికే, ఈ మహమ్మారి వల్ల ఆటోరిక్షాలు మీద కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం విధించే ఆంక్షల వల్ల ఆటోలో ప్రయాణీకుల సంఖ్య తగ్గినట్లు తెలిపారు. ఈ నిర్ణయం వల్ల ఆటో డ్రైవర్ల, ప్రయాణీకుల సమస్యలు మరింత పెరగనున్నట్లు వివరించారు. 

(చదవండి: ఆన్‌లైన్‌లో ప్రెషర్ కుక్కర్ కొంటున్నారా?.. అయితే, జర జాగ్రత్త!)


 

మరిన్ని వార్తలు