ఒలెక్ట్రాకు 123 ఈ–బస్‌ల ఆర్డర్‌.. ఏడు కోట్ల కిలోమీటర్ల ప్రయాణం

20 Sep, 2022 07:19 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రిక్‌ వాహన రంగంలో ఉన్న ఒలెక్ట్రా గ్రీన్‌టెక్, ఈవీ ట్రాన్స్‌ కన్సార్షియం తాజాగా 123 ఎలక్ట్రిక్‌ బస్‌ల సరఫరాకై లెటర్‌ ఆఫ్‌ అవార్డును అందుకుంది. థానే మున్సిపల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అండర్‌టేకింగ్‌ నుంచి దీనిని చేజిక్కించుకుంది. ఆర్డర్‌ విలువ రూ.185 కోట్లు అని ఒలెక్ట్రా సీఎండీ కె.వి.ప్రదీప్‌ తెలిపారు. ఈవీ ట్రాన్స్‌ ఈ ఎలక్ట్రిక్‌ బస్‌లను ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ నుండి కొనుగోలు చేసి 9 నెలల్లో డెలివరీ చేయనుంది.

లిథియం అయాన్‌ బ్యాటరీని బస్‌లకు పొందుపరిచారు. నాలుగు గంటల్లో చార్జింగ్‌ పూర్తి అవుతుంది. మహారాష్ట్రలో ఇప్పటికే కంపెనీ తయారీ బస్‌లు ముంబై, పుణే, నాగ్‌పూర్‌లో పరుగెడుతున్నాయి. ఒలెక్ట్రా ఈ–బస్‌లు దేశవ్యాప్తంగా ఏడు కోట్ల కిలోమీటర్లకు పైగా ప్రయాణించాయని కంపెనీ తెలిపింది.

చదవండి: బీఎస్‌ఎన్‌ఎల్‌ చవకైన ప్లాన్‌.. రూ.275 ప్లాన్‌తో 3300జీబీ.. ఆఫర్‌ లాస్ట్‌ డేట్‌ ఇదే!

మరిన్ని వార్తలు