ఒకసారి చార్జ్‌ చేస్తే 250 కిలోమీటర్లు.. భారత్‌లో తొలి ఎలక్ట్రిక్‌ ట్రక్‌

9 Feb, 2023 07:24 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: మేఘా ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌కు (ఎంఈఐఎల్‌) చెందిన ఎలక్ట్రిక్‌ వాహన తయారీలో ఉన్న ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ భారత్‌లో తొలి ఎలక్ట్రిక్‌ ట్రక్‌ను ఆవిష్కరించింది. బెంగుళూరు వేదికగా జరిగిన ఇండియా ఎనర్జీ వీక్‌–2023లో ఈ వాహనం తన సత్తా చాటింది. బ్యాటరీ ఒకసారి చార్జ్‌ చేస్తే 250 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయడం  టిప్పర్‌ ప్రత్యేకత. 

రెండు గంటల్లోనే చార్జింగ్‌ 100 శాతం అవుతుంది. ఈ–ట్రక్‌ పనితీరు తెలుసుకోవడానికి కంపెనీ 2022 ఏప్రిల్‌లో ట్రయల్స్‌ ప్రారంభించింది. ఎంఈఐఎల్‌ ఎండీ  పి.వి.కృష్ణా రెడ్డి, హైడ్రోకార్బన్స్‌ ప్రెసిడెంట్‌ రాజేశ్‌  రెడ్డి, డైరెక్టర్‌ దొరయ్య ఈ సదస్సుకు హాజరయ్యారు. ఎనర్జీ వీక్‌–2023లో మేఘా అనుబంధ కంపెనీలు డ్రిల్‌మెక్‌ ఇంటర్నేషనల్, పెట్రివెన్‌ ఎస్‌పిఏ, మేఘా గ్యాస్, ఐకామ్‌ పాలుపంచుకున్నాయి.

మరిన్ని వార్తలు