ఒలెక్ట్రా లాభం 825 శాతం జంప్‌

29 Jul, 2022 05:23 IST|Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ఎలక్ట్రిక్‌ వాహన తయారీలో ఉన్న ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ జూన్‌ త్రైమాసికం స్టాండలోన్‌ ఫలితాల్లో నికరలాభం 825 శాతం దూసుకెళ్లి రూ.18.8 కోట్లు సాధించింది. ఎబిటా 322 శాతం అధికమై రూ.36.8 కోట్లకు చేరుకుంది. టర్నోవర్‌ 640 శాతం పెరిగి రూ.305 కోట్లు నమోదైంది.

త్రైమాసికంలో 169 ఎలక్ట్రిక్‌ బస్‌లను సరఫరా చేయడంతో గణనీయమైన ఆదాయ వృద్ధిని సాధించామని ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ సీఎండీ కె.వి.ప్రదీప్‌ తెలిపారు. రానున్న త్రైమాసికాలలో  కొత్త ఉత్పత్తి శ్రేణిని పరిచయం చేయడంతోపాటు మరిన్ని విభాగాల్లోకి ప్రవేశిస్తామని చెప్పారు. రోడ్డు రవాణా సంస్థలకు బస్‌ల డెలివరీలను పెంచడంతోపాటు డెలివరీల షెడ్యూల్‌ను పూర్తి చేస్తామని అన్నారు.

మరిన్ని వార్తలు