ఆగని పెట్రో బాదుడు.. మరోసారి ధరల పెంపు

29 Jun, 2021 10:23 IST|Sakshi

హైదరాబాద్‌ : పెట్రోలు ధరలు పైకి పెరగడమే తప్ప కిందికి చూడటం లేదు. ఒక్క రోజు వ్యవధిలో మరోసారి పెట్రోలు, డీజిల్‌ ధరలు పెంచాయి చమురు సంస్థలు. లీటరు పెట్రోలుపై 35 పైసలు, లీటరు డీజిల్‌పై 28 పైసల వంతున రేట్లు పెంచాయి. ఇప్పటికే పెట్రోలు సెంచరీ దాటగా డిజిల్‌ సెంచరీకి చేరువగా వచ్చింది. 

క్రూడ్‌ ఆయిల్‌​ ధరల్లో పెద్దగా మార్పులు లేకపోయినా దేశీయంగా పెట్రోలు, డీజిల్‌ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెట్‌ క్రూడ్‌ ఆయిల్‌ధర 74.58 డాలర్లుగా నమోదు అ‍య్యింది. క్రితం రోజుతో పోల్చితే ధరలో మార్పు ‍ కేవలం 0.1 శాతమే ఉంది. ఐనప్పటికీ చమురు సంస్థలు ఇంధన ధరలను పెంచుతూ పోతున్నాయి. సామాన్యుల నుంచి ధనవంతుల వరకు అందరి జేబులకు చిల్లులు పెడుతూనే ఉన్నాయి.

తాజాగా పెరిగిన ధరలతో వివిధ నగరాల్లో పెట్రోలు, డీజిల్‌ ధరలు ఇలా ఉన్నాయి. 


సిటీ                     పెట్రోలు        డీజిల్‌ 

హైదరాబాద్‌        102.69        97.20
విశాఖపట్నం      103.76        97.70
తిరుపతి             105.07        98.82
ఢిల్లీ                    98.81          89.18
ముంబై              104.90         96.72
చెన్నై                99.80           93.72
బెంగళూరు       102.11          94.54

చదవండి : నెట్‌ఫ్లిక్స్‌లో ఈ కొత్త ఫీచర్‌ ఏదో బాగుందే..!

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు