ఉద్యోగాలకు అప్లై చేసిన మహిళలు.. 2023లో ఇంతమందా?

20 Jan, 2024 20:45 IST|Sakshi

గత కొంతకాలంగా ఉద్యోగాల్లో చేరే మహిళల సంఖ్య బాగా పెరిగింది. దీంతో జాబ్ కోసం అప్లై చేసుకునే వారు క్రమంగా పెరుగుతున్నారు. 2023లో దేశం మొత్తం మీద ఎంత మంది ఉద్యోగాలకు అప్లై చేశారనే డేటాను apna.co విడుదల చేసింది.

విడుదలైన డేటా ప్రకారం, గత ఏడాది ఉద్యోగాలకు అప్లై చేసుకున్న వారిలో మహిళలు కోటి మంది ఉన్నట్లు తెలుస్తోంది. వివిధ రంగాల్లో ఉద్యోగాల కోసం పురుషులతో పాటు మహిళలు ఇంతమంది అప్లై చేసుకోవడం గొప్ప విషయమని చెప్పాలి. ఇందులో కూడా టైర్ 1, టైర్ 2 నగరాల నుంచి ఎక్కువమంది మహిళలు ఉద్యోగాలకు అప్లై చేసుకున్నట్లు తెలుస్తోంది.

2023లో మొత్తం 3.2 కోట్లమంది ఉద్యోగాలకు అప్లై చేసుకోగా.. ఇందులో 1 కోటి మంది మహిళలే కావడం గమనార్హం. అదే 2022లో ఉద్యోగాలకు అప్లై చేసుకున్న 2.7 కోట్ల మందిలో 87 లక్షలమంది మహిలు ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే ఉద్యోగాలకు అప్లై చేసిన మహిళల సంఖ్య 2022 కంటే 13 శాతం పెరిగినట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: రోబో పనికి ఫిదా అయిన ఆనంద్ మహీంద్రా - వీడియో వైరల్

ప్రస్తుతం ఇంటిదగ్గరే ఉంది ఇంటిపనులు మాత్రమే చేయడానికి మహిళలు ఎక్కువ ఆసక్తి చూపడం లేదు. తమను తాము నిరూపించుకోవడానికి ఉద్యోగాలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.. తమదైన రీతిలో గుర్తింపు తెచ్చుకుంటున్నారు. 2023లో నిమిషానికి 100 ఉద్యోగాలకు ధరఖాస్తులు వచ్చినట్లు.. ఇందులో ఎక్కువగా సేల్స్ సపోర్ట్, ఎంటర్‌ప్రైజ్ సేల్స్, అడ్వర్టైజింగ్, రియల్ ఎస్టేట్, ఇన్‌సైడ్ సేల్స్, మార్కెటింగ్, ఈ కామర్స్ వంటి ఉద్యోగాలకు ఎక్కువ అప్లికేషన్స్ వచ్చినట్లు తెలుస్తోంది.

>
మరిన్ని వార్తలు