అత్యంత ఫాస్టెస్ట్ ఎలక్ట్రిక్ బైక్ లాంచ్

28 Dec, 2020 14:28 IST|Sakshi

న్యూఢీల్లీ: వాతావరణంలో పెరుగుతున్న కాలుష్యం దృష్ట్యా భవిష్యత్ లో ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగనున్న నేపథ్యంలో పలు కంపెనీలు మార్కెట్ లోకి ఎలక్ట్రిక్ బైకును లాంచ్ చేస్తున్నాయి. తాజాగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన స్టార్టప్ కంపెనీ అయిన వన్ ఎలక్ట్రిక్ తన 'కేఆర్ఐడిఎన్' ఎలక్ట్రిక్ మోటారు సైకిల్ లను మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్, బెంగళూరులో డెలివరీలను ప్రారంభించినట్లు సంస్థ పేర్కొంది. 2021 జనవరి చివరి నాటికీ జనవరి నాటికి తమిళనాడు, కేరళలో ఎలక్ట్రిక్ వెహికల్ ని అందుబాటులోకి తేనున్నట్లు పేర్కొంది. తరువాత దశల వారీగా మహారాష్ట్ర, ఢిల్లీలో ఎన్‌సిఆర్లలో డెలివరీలు చేయనున్నట్లు పేర్కొంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం ఈ బైక్ టాప్ స్పీడ్ వచ్చేసి 95 కెఎంపిహెచ్. మోటారుసైకిల్ ధర1.29 లక్షలు(ఎక్స్-షోరూమ్). సంస్కృతంలో కేఆర్ఐడిఎన్ అంటే 'ఆడటం' అని అర్థం.(చదవండి: టీవీల రేట్లకు రెక్కలు

ఇది 5.5 కిలోవాట్ లేదా 7.4 బీహెచ్ పీతో వస్తుంది. ఇందులో 80/100 17 అంగుళాల ట్యూబ్ లెస్ ఫ్రంట్ వీల్, 120/80 16 అంగుళాల ట్యూబ్ లెస్ రియర్ వీల్ కలిగి ఉంది. ఈ బైక్ 240 మిమీ డిస్క్, వెనుకవైపు 220 ఎంఎం డిస్క్ తో పాటు కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టం కూడా ఉంటుంది. ఇందులో ఫ్రంట్ లో బైక్ టెలిస్కోపిక్ ఫోర్క్స్ , వెనుక భాగంలో డ్యూయల్ షాక్ అబ్జార్బర్స్ పొందుతుంది. ఈ ఎలక్ట్రిక్ మోటారు సైకిల్ ను ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే ఎకో మోడ్‌లో 110 కిలోమీటర్లు, సాధారణ మోడ్‌లో 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. ఈ బైక్ కేవలం 8 సెకన్లలో 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఫీచర్స్ విషయానికొస్తే, మోటారు సైకిల్‌కు డిజిటల్ ఓడోమీటర్‌తో పాటు జి‌పి‌ఎస్, బ్లూటూత్ కనెక్టివిటీ లభిస్తుంది. రోడ్ ట్రయల్ తో పాటు బైక్ సంబంధిత పరీక్షలు విజయవంతంగా పూర్తీ చేసింది. డెలివరీ ఆపరేటర్లు, బైక్ టాక్సీల కోసం ప్రత్యేక బైకులు కూడా తయారు చేయనున్నట్లు పేర్కొంది. 

మరిన్ని వార్తలు