One Moto Global: బ్రిటన్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్లు ఇప్పుడు భారత్‌లో..!  ధర ఏంతంటే..?

18 Nov, 2021 19:40 IST|Sakshi

One Moto Global To Launched Its First Two Electric Scooters In India: యూకేకు చెందిన ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ సంస్థ వన్ మోటో గ్లోబల్‌ భారత మార్కెట్లలోకి రెండు ఎలక్ట్రిక్‌ స్కూటర్ల(బైకా, కామ్యూటా) మోడల్స్‌ను లాంచ్‌ చేసింది. ఈ బైక్స్‌ బుకింగ్స్‌ నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఫాస్ట్‌ ఛార్జింగ్‌ టెక్నాలజీ, మొబిలీటీ ట్రాకింగ్‌, బ్యాటరీ స్వాప్‌ అప్షన్స్‌తో రానున్నాయి. వన్ మోటో గ్లోబల్‌ ఇండియాలో అధికారికంగా హైదరాబాద్‌‌‌‌లో తమ ప్రధాన కార్యాలయాన్ని ఏర్పాటు  చేసింది. 
చదవండి: ఎలక్ట్రిక్ వాహన ప్రపంచంలో లూసిడ్‌ రికార్డు.. 840 కి.మీ రేంజ్, ధర ఎంతో తెలుసా?

కమ్యూటా బైక్‌ 80 కిలోమీటర్ల శ్రేణి గల ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్ స్కూటర్. రూ.130,000 బేస్ ధరగా నిర్ణయించారు.  బైకా ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ 4000కిలో వాట్‌ శక్తివంతమైన బాష్ మోటార్ సహాయంతో 150 కిలోమీటర్ల మేర ప్రయాణించనుంది. ప్రస్తుతం కమ్యూటా బైక్లను కంపెనీ వెబ్‌సైట్‌ నుంచి రూ. 1111 అమౌంట్‌ చెల్లించి ప్రి-బుక్‌ చేసుకోవాల్సి ఉంటుంది.  2022 జనవరిలో కొనుగోలుదారులకు డెలివరీ చేయనుంది. ఇండియన్ స్టార్టప్ ఎలైసియం ఆటోమోటివ్స్ భారతదేశంలో వన్ మోటోను లాంఛ్ చేసింది. 

బైకా ఫీచర్స్‌: 
వన్ మోటో బైకా ఈవీ స్కూటర్‌  3.3 సెకన్లలో 0-50 కిమీ వేగాన్ని అందుకోగలవు. టాప్ స్పీడ్ వచ్చే 85 కిమీగా ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 150 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. ఛార్జింగ్ సమయం 4 గంటలు. 

కమ్యూటా ఫీచర్స్‌:
ఈ బైక్‌ గంటకు  55 కిలోమీటర్ల గరిష్ట వేగంతో ప్రయాణించనుంది. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 80కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తాయి. ఛార్జింగ్‌ సమయం 4 గంటలు. 
చదవండి: కళ్లు చెదిరే లుక్స్‌తో సుజుకీ నయా స్కూటీ లాంచ్‌..! ధర ఎంతంటే..?

మరిన్ని వార్తలు