పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే అభ్యర్ధుల కోసం "calcusindia" కూపన్ ఆవిష్కరణ

8 Jul, 2021 20:17 IST|Sakshi

దేశవ్యాప్తంగా అన్ని పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే అభ్యర్ధుల కోసం IIT-IIM ALUMNI సహకారంతో 'కాల్కస్ ఇండియా' యాప్ను రూపొందించిన కాల్కస్ ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్ వారు, ఆ సంస్థ వార్షికోత్సవం సందర్భంగా "వన్ పాస్.. ఆల్ఎగ్జాంస్" అనే పరిమిత కాలపు అఫర్ ద్వారా 'calcusindia' అనే కూపన్ ను ప్రకటించారు. ఈ కూపన్ ను తెలంగాణ ఆర్ధిక శాఖ మంత్రి శ్రీ టి హరీష్ రావు గారు ఈ రోజు విడుదల చేశారు. ఈ ఆఫర్ వినియోగించుకోదలచిన వారు పేమెంట్ చేసేటప్పుడు 'calcusindia' అనే కూపన్ ను అప్లై చేయటం ద్వారా ఈ 99 రూపాయల ఆఫర్ ను పొందగలుగుతారు.

ఈ ప్రీమియం ప్యాకేజీ ఆఫర్ తీసుకోవటం ద్వారా విద్యార్ధులు యాప్ లో ఉన్న పాఠశాల స్థాయి నుంచి సీవిల్ ఎంట్రన్స్ వరకు మొత్తం 1354 కాటగిరీల నుంచి 46000కు పైగా టెస్టులను 6 నెలల పాటు పూర్తి ఉచితంగా సాధన చేయవచ్చు. నాణ్యమైన విద్యను పేద, మద్య తరగతివర్గాల వారికి కూడా అందుబాటులో ఉండేలా ఈ ఆఫర్ ప్రకటించిన సంస్థ ఫౌండర్ వాణీకుమారిని మంత్రి హరీష్ రావు అభినందించారు.

అందరికీ విద్య.. అందుబాటు ధరలో
పలురకాల కాంపిటేటివ్ పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్ధులకు అన్ని రకాల పరీక్షలను అతితక్కువ ధరలో ఒకేచోట ప్రాక్టీస్ చేసుకునే సదుపాయం కల్పించాలనే సదుద్దేశ్యంతో ఈ విధమైన ఆఫర్ ప్రకటించిన భారత దేశపు ఏకైక సంస్థ కాల్కస్ఇండియా. గూగుల్ ప్లే స్టోర్ నుంచి "కాల్కస్ ఇండియా" యాప్ ను డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకున్న వారు కొన్ని ఉచిత పరీక్షలను ప్రాక్టీస్ చేసి నచ్చిన వారు ప్రీమియం ప్యాకేజీకి సభ్యత్వం చేసుకోవచ్చును. మరిన్ని వివరాలకు calcusindia.com పోర్టల్ ను సందర్శించవచ్చు.

మరిన్ని వార్తలు