ఈ ఫోన్‌ కొంటే.. 1 టెరా బైట్‌ క్లౌడ్‌ స్టోరేజీ ఉచితం

14 Jun, 2021 18:59 IST|Sakshi

స్టోరేజీ ఆఫర్‌ ప్రకటించిన వన్‌ప్లస్‌

నార్డ్‌ 5జీ ఫోన్ కొటే 1 టెరాబైట్‌ క్లౌడ్‌ స్టోరేజీ

రెడ్‌ కేబుల్‌ కేర్‌ యూజర్లు మాత్రమే 

వెబ్‌డెస్క్‌: వన్‌ టెరా బైట్‌ క్లౌడ్‌ స్టోరేజీని ఆఫర్‌గా ప్రకటించింది వన్‌ప్లస్‌ సంస్థ. త్వరలో మార్కెట్‌లోకి రాబోతున్న వన్‌ప్లస్‌ నార్డ్‌ CE 5జీ ప్రమోషన్‌లో భాగంగా ఈ ఆఫర్‌ అమల్లోకి తెచ్చింది. గూగుల్‌ క్లౌడ్‌ స్టోరేజీ నిబంధనల్లో మార్పులు తెచ్చిన ప్రస్తుత తరుణంలో 1 టెరా బైట్‌ క్లౌడ్‌ స్టోరేజీ ఆఫర్‌ మార్కెట్‌లో సంచలనంగా మారింది. ఈ ఫోన్‌ యూజర్లు వేలాది ఫోటోలు, వందలాది వీడియో కంటెంట్‌ని  నిశ్చింతగా భద్రపరుచుకోవచ్చు. 

జూన్‌ 16న
జూన్‌ 16 నుంచి అమెజాన్‌లో సేల్‌కి రానున్న ఈ మొబైల్‌  ప్రారంభ ధర రూ. 22,999గా ఉంది. హెడ్‌డీఎఫ్‌సీ క్రెడిట్‌ కార్డుపై రూ. 1000 తగ్గింపు లభిస్తోంది. దీంతో పాటు మొదటి రెండు రోజులు ఆర్డర్‌ చేసిన కారికి రూ. 500 క్యాష్‌బ్యాక్‌ అమెజాన్‌ ప్రకటించింది. అంతేకాకుండా వన్‌ టెరాబైట్‌ క్లౌడ్‌ స్టోరేజీని కూడా అందిస్తోంది. అయితే  జులై 31వరకు కేవలం రెడ్‌ కేబుల్‌ కేర్‌ యూజర్స్‌కి మాత్రమే ఈ ఆఫర్‌ వర్తిస్తుందని వన్‌ప్లస్‌ పేర్కొంది. 

హై ఎండ్‌ ఫీచర్స్‌
హై ఎండ్‌ ఫీచర్స్‌ విత్‌ లో బడ్జెట్‌ మొబైల్‌ వన్‌ ప్లస్‌ నార్డ్‌ సీఈ 5జీ ఫోన్‌ కోసం టెక్‌ ప్రియులంతా ఎ‍ప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. జూన్‌ 16న మార్కెట్‌లోకి రాబోతున్న ఈ ఫోన్‌కు అమెజాన్‌లో ఇప్పటికే ఆర్డర్లు ఫుల్‌ స్వింగ్‌లో ఉన్నాయి. ఈ ఫోన్‌కి సంబంధించి బిల్ట్‌ క్వాలిటీ, ఫీచర్స్‌, కెమెరా, ర్యామ్‌ మేనేజ్‌మెంట్‌ అత్యుత్తమంగా ఉందని రివ్యూయర్లు అభిప్రాయపడుతున్నారు.

స్నాప్‌డ్రాగన్‌ 750జీ 
5జీ టెక్నాలజీతో వచ్చన తొలి హై ఎండ్‌ బడ్జెట్‌ ఫోన్‌గా వన్‌ ప్లస్‌ నార్డ్‌ జీఈ నిలిచింది. ఈ ఫోన్‌లో న్యూ ఏజ్‌ ప్రాసెసరైన స్నాప్‌డ్రాగన్‌ 750 జీ ప్రాసెసర్‌ ఉపయోగించారు. 90 హెర్జ్‌ అమోల్డ్‌ డిస్‌ప్లే పొందు పరిచారు. హై ఎండ్‌ ఫోన్లకు తగ్గరీతిలో గేమింగ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఈ ఫోన్‌ అందిస్తోందని రివ్యూయర్లు చెబుతున్నారు. డిస్‌ప్లే, కెమెరా, ప్రాసెసర్‌ విషయంలో వన్‌ప్లస్‌ తనకు సాటైన అత్యుత్తమ ప్రమాణాలు మరోసారి పాటించింది. 30 టీ ఫాస్ట్‌ ఛార్జింగ్‌తో పాటు ఏకంగా 4500 మిల్లీయాంప్‌ పవర్‌ బ్యాటరీని అందించింది. దీంతో ఎక్కువ సేపు వీడియో కంటెంట్‌ చూసేందుకు ఈ ఫోన్‌ అనువుగా ఉందంటున్నారు నిపుణులు. 

చదవండి : Asus ROG Phone 3 : చేతిలో ఇమిడిపోయే గేమింగ్ ఫోన్

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు