OnePlus 10 Pro: వన్‌ప్లస్‌ 10 ప్రొ పై భారీ తగ్గింపు, ఎక్కడ?

24 Sep, 2022 19:45 IST|Sakshi

సాక్షి,ముంబై: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో వన్‌ప్లస్ 10ప్రో  భారీ డిస్కౌంట్‌  ధరకకు లభిస్తోంది. అంతేకాదు ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డ్‌ద్వారా వన్‌ప్లస్‌ 10ప్రో స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలను కుంటున్న కస్టమర్లు అదనంగా  రూ. 5,000 తగ్గింపును కూడా పొందవచ్చు.

చదవండి:  మీషో మెగా బ్లాక్‌బస్టర్ సేల్‌: ఒక్కరోజులోనే.. 

వన్‌ప్లస్‌కుసంబంధించి ఏడాది లాంచ్‌ చేసిన అత్యంత  ప్రీమియం స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 10 ప్రో. ఇది ప్రస్తుతం రూ.66,999 నుంచి రూ.61,999కి లిస్ట్‌ అయింది. ఎస్‌బీఐ ఆఫర్‌ద్వారా రూ.56,999 సొంతం చేసుకోవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ రూ. 22,000 వరకు ఉంటుంది.  అలాగే షరతుల మేరకు కనీసం 4,000 తగ్గింపు లభిస్తుంది.  అంటే సుమారు 52 వేలకు అందుబాటులో ఉంటుంది.  ఈ ఆఫర్ తొమ్మిది రోజుల్లో ముగుస్తుందని అమెజాన్ పేజీ ద్వారా తెలుస్తోంది.

 క్వాల్కం  స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 చిప్‌సెట్‌, ది వైర్‌లెస్ ఛార్జింగ్‌, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో 48-మెగాపిక్సెల్ ప్రైమరీ షూటర్, 50-మెగాపిక్సెల్ వైడ్-యాంగిల్ లెన్స్, 8మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ లాంటివి ప్రధాన ఫీచర్లు. (TVS Jupiter Classic Edition: టీవీఎస్‌ జూపిటర్‌ క్లాసిక్‌ లాంచ్‌.. ధర ఎంతంటే)

వన్‌ప్లస్ 10 ప్రో ఫీచర్లు
6.70 అంగుళాల (1440x3216) డిస్‌ప్లే
ఆండ్రాయిడ్ 12
32ఎంపీ సెల్ఫీ కెమెరా 
8జీబీ,12 జీబీ ర్యామ్‌
128, 256, 512, జీబీ మొమరీవేరియంట్స్‌
5000mAhబ్యాటరీ కెపాసిటీ 
 

మరిన్ని వార్తలు