వన్‌ప్లస్‌ 10టీ 5జీ  వచ్చేసింది, అదిరిపోయే ఎక్స్ఛేంజ్ ఆఫర్‌

16 Aug, 2022 13:09 IST|Sakshi

ముంబై: చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ వన్‌ప్లస్ ఇండియా తన ఫ్లాగ్‌షిప్‌ మొబైల్‌ను లాంచ్‌ చేసింది.  వన్‌ప్లస్‌ 10టీ 5 జీ పేరుతోఈ స్మార్ట్‌ఫోన్‌ను 16 జీబీ వేరియంట్‌తో భారతదేశంలో అత్యుత్తమ ర్యామ్‌తో  తీసుకొచ్చింది.  మొత్తం  8, 12, 16జీబీ  ర్యామ్‌ వేరియంట్లలో లాంచ్‌ చేసింది. 12జీబీ ర్యామ్‌ 256 జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ. 54999గా నిర్ణయించింది.   అలాగే 16 జీబీ ర్యామ్‌, 256 జీబీ స్టోరేజ్ ధరను  రూ. 55999గా ఉంచింది. 

8 జీబీ వేరియింట్‌పై అమెజాన్‌, వన్‌ప్లస్‌ 10టీ 5 జీ స్మార్ట్‌ఫోన్ (8 జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌)  ‌49వేల 999 రూపాయలకు  అందుబాటులో ఉంచింది. అయితే అమెజాన్‌, వన్‌ప్లస్‌ వెబ్‌సైట్‌ ద్వారా తగ్గింపు ధరలో దీన్ని కొనుగోలు చేయవచ్చ.  దీంతోపాటు ఎస్‌బీఐ కార్డు ద్వారా కొనుగోలుచేస్తే  3 వేల తగ్గింపు లభిస్తుంది. అలాగే కోటక్ బ్యాంక్ కార్డు కొనుగోలుతో ఈఎంఐ ఎంచుకున్నవారికి  1500 తగ్గింపు అదేవిధంగా, స్టాండర్డ్ చార్టర్డ్ క్రెడిట్ కార్డ్‌ ద్వారా కొంటే 1500 ధరతగ్గుతుంది. అంతేకాకుండా పాత వన్‌ప్లస్‌ సెల్‌ఫోన్‌ను మార్పిడి చేసుకోవడం ద్వారా వినియోగదారులు రూ. 15,750 దాకా ప్రయోజనం పొందవచ్చు.   

వన్‌ప్లస్‌ 10టీ 5 జీ స్మార్ట్‌ఫోన్  ఫీచర్లు 
6.7-అంగుళాల పూర్తి-HD+ ఫ్లూయిడ్ AMOLED  డిస్‌ప్లే
1080×2,412 పిక్సెల్ రిజల్యూషన్‌
క్వాల్కం ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 ప్రాసెసర్
50MP, 8MP  2MP  ట్రిపుల్‌ రియర్‌ కెమెరా
16 ఎంపీ సెల్ఫీ కెమెరా
4,800mAh బ్యాటరీ
150వాట్ల ఫాస్ట్‌  ఛార్జింగ్  
 

మరిన్ని వార్తలు