వన్‌ప్లస్‌ యూజర్లకు బంపర్ ఆఫర్!

27 Aug, 2021 19:27 IST|Sakshi

ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్‌ ఇండియా ఎంపిక చేసిన మోడల్స్ బ్యాటరీ రీప్లేస్ మెంట్ కోసం ఆఫర్ అందిస్తోంది. వన్‌ప్లస్‌ కంపెనీ భారతదేశంలో వన్‌ప్లస్‌ 3, వన్‌ప్లస్‌ 5 సిరీస్, వన్‌ప్లస్‌ 6 సిరీస్ ఫోన్ బ్యాటరీలను 50 శాతం ధరకే ఇవ్వనున్నట్లు తెలిపింది. మీ దగ్గర కనుక వన్‌ప్లస్‌ 3 - వన్‌ప్లస్‌ 6 సిరీస్ మధ్య గల ఫోన్ ఉంటే బ్యాటరీ రీప్లేస్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం. కంపెనీ తన పోర్టల్ దీనికి సంబంధించిన వివరాలను పేర్కొంది. మీరు మీ మొబైల్ ఎక్కువ కాలం వాడాలి అనుకుంటే పాత మోడల్స్ బ్యాటరీ మార్చుకోవడం ఉత్తమం. 

కంపెనీ అధికారిక పోర్టల్ ద్వారా మీరు మీ వన్‌ప్లస్‌ బ్యాటరీని మార్చవచ్చు. ఇక్కడ లింక్ ఉంది. ఇక గత కొంత కాలంగా వన్‌ప్లస్‌ 9ఆర్ టీ స్మార్ట్ ఫోన్ తీసుకొస్తున్నట్లు ఊహాగానాలు వస్తున్నాయి. లాంఛ్ కు ముందే ఫోన్ పూర్తి స్పెసిఫికేషన్లు, ధర నెట్టింట్లో లీక్ అయ్యాయి. ఒక ప్రసిద్ధ టిప్ స్టార్ చైనీస్ మైక్రోబ్లాగింగ్ సైట్ వీబోలో ఫోన్ కు సంబంధించిన సమాచారాన్ని లీక్ చేశారు. వన్‌ప్లస్‌ 9ఆర్ టీ స్మార్ట్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్ కలిగి ఉంటుందని, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని పోస్ట్ చేశారు. అలాగే, 9ఆర్ టీలో 65 డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుందని పేర్కొన్నారు.(చదవండి: చైనా దెబ్బకి పండగ సీజన్‌లో నో డిస్కౌంట్స్)

మరిన్ని వార్తలు