వన్‌ప్లస్‌ 8టీ, సూపర్‌ గేమింగ్‌ ఎడిషన్‌

3 Nov, 2020 10:33 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: చైనా స్మార్ట్‌ఫోన్‌ మేకర్‌ వన్‌ప్లస్ 8 టీ  ప్రత్యేక సైబర్‌పంక్ 2077 ఎడిషన్‌ను చైనా మార్కెట్లో విడుదల చేసింది. గేమింగ​ ప్రియులకోసం వీడియో గేమ్ డెవలపర్‌ సీడీ  ప్రొజెక్ట్ రెడ్‌తో కలిసి బేసిక్‌ వెర్షన్‌ కంటే చాలా భిన్నంగా తీసుకొచ్చింది. 12 జీబీ ర్యామ్,  256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్  సింగిల్‌ వెర్షన్‌లో ఆవిష్కరించింది. అలాగే రియర్‌ కెమెరా మాడ్యూల్ ​ ఈ స్మార్ట్‌ఫోన్‌లో అతిపెద్ద హైలైట్‌గా ఉంది. మిగిలిన ఫీచర్లను వన్‌ప్లస్ 8 టీ మాదిరిగానే ఉంచింది.  చైనాలో ప్రీఆర్డర్లు ఇప్పటికే ప్రారంభమైనాయి. నవంబర్ 11నుండి కొనుగోలుకు అందుబాటులో ఉండనుండగా, భారతీయ మార్కెట్లో ఎపుడు లాంచ్‌  చేసేదీ కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు.

వన్‌ప్లస్ 8 టీ సైబర్‌పంక్ 2077 ఫీచర్లు
6.55 టచ్‌స్క్రీన్  డిస్‌ప్లే
1080x2400 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
ఆండ్రాయిడ్ 11
స్నాప్‌డ్రాగన్ 865 చిప్

రియర్‌ క్వాడ్‌కెమెరా
48 (ఎఫ్ / 1.7) + 16(ఎఫ్ / 2.2) + 5+ 2ఎంపీ
16 మెగాపిక్సెల్  సెల్పీ కెమెరా
65 వాట్స్‌​ ఫాస్ట్ ఛార్జింగ్
4500  ఎంఏహెచ్‌ బ్యాటరీ

 ధర 3,999 యెన్లు (సుమారు  రూ.44,558)

మరిన్ని వార్తలు