వన్‌ప్లస్ ‌9 స్మార్ట్ ఫోన్ కెమెరా ఫీచర్స్‌ వైరల్

22 Nov, 2020 12:14 IST|Sakshi

భారత్ లో 2021 మార్చిలో వన్ ప్లస్ 9 ఫ్లాగ్ షిప్ ఫోన్ ని తీసుకు వస్తునట్లు ఒక వార్త ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతుంది. ఇప్పటి వరకు తెలిసిన వివరాల ప్రకారం వన్‌ప్లస్ 9 స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రియర్ కెమెరాలను కలిగి ఉంటాయని సమాచారం. వన్‌ప్లస్ 9లో మూడు కెమెరా కలిగి ఉన్న ఒక చిత్రం ఆన్‌లైన్‌లో వైరల్ అవుతుంది. ఈ చిత్రాన్ని గమనించినట్లయితే ఇందులో రెండు పెద్ద సెన్సార్ గల కెమెరాలు మరియు ఒక చిన్న కెమెరా సెన్సార్ ఉంది. వీటి పక్కన చిన్న డ్యూయల్-టోన్ LED ఫ్లాష్ ఉంటుంది. వన్‌ప్లస్ 9 ఫోన్ లో పంచ్ - హోల్ డిస్ప్లేతో వస్తుందని సమాచారం.
 

వన్‌ప్లస్ 9 కెమెరా ఫీచర్స్

వన్‌ప్లస్ 9 ప్రధాన కెమెరా 48 మెగా పిక్సల్ కెమెరా తో రానుంది. ఈ 48ఎంపీ ప్రధాన కెమెరాలో సెన్సార్ సోనీ IMX 586 లేదా IMX689 ఉపయోగించవచ్చు. వన్‌ప్లస్ 9 ఎంపీ ప్రధాన కెమెరా అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ కు సపోర్ట్ చేస్తుంది. దీనిలో ఉన్న 16ఎంపీ కెమెరా అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్ కలిగి ఉండనుంది. ఇది వన్ ప్లస్ 8టీ ఫోన్ తో పోలిస్తే పెద్ద మార్పు. చిత్రంలో ఉన్న చిన్న కెమెరా గురుంచి ఇంకా ఎటువంటి సమాచారం లేదు. దీనిలో మోనోక్రోమ్ లేదా మాక్రో సెన్సార్ ఉపయోగించవచ్చు. అలాగే ఫ్రంట్ కెమెరా 32 ఎంపీ కెమెరాతో రానుంది. (చదవండి: ప్రపంచంలోనే టాప్ - 10 స్మార్ట్ ఫోన్స్ ఇవే

వన్‌ప్లస్ 9, వన్ ప్లస్ 8టీ యొక్క 6.55-అంగుళాల ప్యానెల్ కంటే పెద్దదిగా ఉండనుంది. వన్ ప్లస్ 9లో 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌తో డిస ప్లే ప్రవేశపెడుతున్నట్లు నివేదికలు వచ్చినప్పటికీ 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్‌ డిస్‌ప్లేను కలిగి ఉండనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మోడల్ నెంబర్లు LE2110, LE2117, LE2119 గల మొబైల్ ఫోన్లు 2021 మార్చిలో లాంచ్ కానున్నట్లు సమాచారం. ఈ స్మార్ట్‌ఫోన్ లో ఆక్టా-కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 875 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్‌, అలాగే 65W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుందని సమాచారం. ఈ ఫోన్ గీక్ బెంచ్ పరీక్షలో ఫోన్ సింగిల్-కోర్ స్కోరు 1,122, మల్టీ-కోర్ స్కోరు 2,733 సాధించింది. దీని ధర 47,000 ఉండవచ్చు. వన్‌ప్లస్ 9 గురించి వన్‌ప్లస్ సంస్థ ఎలాంటి అధికారిక వివరాలను వెల్లడించలేదు. 


 

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా