లీకైన వన్‌ప్లస్‌ 9ఆర్ టీ స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్స్

25 Aug, 2021 18:46 IST|Sakshi

ప్రముఖ చైనా మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్‌ త్వరలో మార్కెట్లోకి తీసుకొనిరాబోయే 9ఆర్ టీ స్మార్ట్‌ఫోన్ ధర, స్పెసిఫికేషన్లు ఇప్పటికే లీక్ అయినట్లు తెలుస్తుంది. చైనా టిప్ స్టార్ ఒకతను చైనీస్ మైక్రోబ్లాగింగ్ వెబ్ సైట్ వీబోలో దీనికి సంబంధించిన వివరాలను షేర్ చేశారు. వన్‌ప్లస్‌ 9ఆర్ టీ క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 870 ప్రాసెసర్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ తో వస్తుందని పేర్కొన్నారు. ఈ ఫోన్ 65డబ్ల్యు ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది అని కూడా తెలిపారు.

వన్‌ప్లస్‌ 9ఆర్ టీ 8/128 జీబీ వేరియంట్, 8/ 256 జీబీ అనే రెండు వేరియంట్లలో వచ్చే అవకాశం ఉంది. మన ఇండియాలో వన్‌ప్లస్‌ 9ఆర్ టీ 8/128 జీబీ ధర రూ.39,999గాను, వన్‌ప్లస్‌ 9ఆర్ టీ 8/256 జీబీ వేరియంట్ ధర రూ.43,999 ఉండే అవకాశం ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6.55 అంగుళాల శామ్‌సంగ్‌ ఈ3 ఫుల్-హెచ్ డీ+ సూపర్ అమోల్డ్ డిస్ ప్లేతో రానునట్లు తెలుస్తుంది. దీని డిస్ ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ రానున్నట్లు టిప్ స్టార్ పేర్కొన్నారు. ఈ ఫోన్ 8జీబీ ఎల్ పీడిడీఆర్4ఎక్స్ ర్యామ్, 256జీబీ యుఎఫ్ ఎస్ 3.1 స్టోరేజ్ తో వస్తుందని తెలిపారు. వన్‌ప్లస్‌ 9ఆర్ టీ మన దేశంలో అక్టోబర్ లో లాంచ్ అయ్యే అవకాశం ఉంది.(చదవండి: హీరో ఎలక్ట్రిక్ ఉద్యోగులకు అదిరిపోయే బెనిఫిట్స్)

మరిన్ని వార్తలు