వన్‌ప్లస్‌కు భారీ షాక్‌!

13 Oct, 2020 15:04 IST|Sakshi

వన్‌ప్లస్ సహ వ్యవస్థాపకుడు కార్ల్ పీ సంస్థను వదిలి వెళ్లిపోవచ్చనే వార్తలు వినిబడుతున్నాయి. పీ తన సొంత వెంచర్ ప్రారంభించడానికి కంపెనీని విడిచిపెట్టినట్లు కథనాలు వెలువెడుతున్నాయి. వన్‌ప్లస్ 8టీ ఈ నెల 14న విడుదల చేయనుండగా ఇప్పుడు పీ వెళ్లిపోవడం సెన్సెషన్‌గా మారింది. దీనిపై వన్‌ప్లస్‌ నుంచి కానీ కార్ల్‌ పీ దగ్గర నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అంతేకాకుండా పీ  ట్విట్టర్ ఖాతా బయోలో ఇప్పటికీ  #NewBeginnings @oneplus అనే ఉంది.

అయితే ఈ విషయాన్ని రెడ్డిట్‌ యూజర్‌ జోన్‌సిగుర్‌ తన ఖాతా ద్వారా తెలిపారు. వన్‌ప్లస్‌ ఈ మెయిల్స్‌లా కనిపించే ఫోటోలను షేర్‌చేశారు. వీటిలో కార్ల్‌ పీ సంస్థ నుంచి తప్పుకుంటున్నట్లు ఉంది. అయితే అందులో కార్ల్‌పీ డిజిగ్నేషన్‌ గురించి ఎక్కడ ప్రస్తవించలేదు. ఇకపై కార్ల్‌పీ స్థానంలో ఎమిలీడై  వన్‌ప్లస్‌ కార్యకలాపాలు నిర్వహించనున్నారు. అయితే ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. చైనాలోని షెన్‌జెన్ ఆధారంగా వన్‌ప్లస్‌ను పీట్ లా, కార్ల్ పీ 2013లో స్థాపించారు. ఈ తరువాత వన్‌ప్లస్ వన్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేశారు. 

చదవండి: వన్‌ప్లస్ సర్‌ప్రైజ్‌; తక్కువ ధరకే స్మార్ట్‌ఫోన్లు

మరిన్ని వార్తలు