వన్‌ప్లస్‌ ప్రియులకి గుడ్ న్యూస్

27 Jan, 2021 20:09 IST|Sakshi

గత వారమే వన్‌ప్లస్ ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ బీటా వెర్షన్ ను వన్‌ప్లస్ 7, 7టీ సిరీస్ కోసం విడుదల చేసింది. వన్‌ప్లస్ తన వినియోగదారులకు కెమెరా విషయంలో ఇంకా మంచి అనుభూతిని అందించడానికి కొత్త అప్డేట్ ను తీసుకొచ్చింది. దీనిలో భాగంగా తన ఫోన్‌ కెమెరా యాప్‌కి ప్రత్యేక మోడ్స్‌ జోడించి తీసుకొస్తోంది. వన్‌ప్లస్ కెమెరాలో 6.4.23 వెర్షన్ కింద "టిల్ట్‌-షిఫ్ట్, స్టార్ట్‌ బస్ట్, మూన్, హైపర్‌ లాప్స్" అనే కొత్త ఫీచర్స్ తీసుకొస్తుంది. వీటితో వన్‌ప్లస్‌ యూజర్లు తమ ఫోన్‌ కెమెరాతో ఫొటోలను ఇతరుల కంటే భిన్నంగా తీయవచ్చు.(చదవండి: మోటోరోలా ఎడ్జ్ ఎస్‌లో సరికొత్త ఫీచర్స్)

ప్రస్తుతం ఈ సరికొత్త వన్‌ప్లస్‌ కెమెరా ఫీచర్లను కొందరు యూజర్లకు మాత్రమే ప్రయోగాత్మకంగా అందుబాటులో ఉంది. త్వరలోనే అందుబాటులోకి రానున్న వన్‌ప్లస్‌ 9 సిరీస్‌లో వీటిని తీసుకొస్తారని సమాచారం. కొత్తగా తీసుకురాబోయే టిల్ట్‌-షిప్ట్‌ మోడ్‌తో సాధారణ ఫోటోలను చాలా చిన్న ఫొటోలుగా క్రియేట్ చేయవచ్చు. అలాగే "స్టార్‌బర్స్ట్" మోడ్‌తో సూర్యని లాగా ప్రకాశించే ప్రతి దానిని ఒక నక్షత్రంలాగా మార్చవచ్చు. రాత్రి వేళలో ఆకాశాన్ని ఫోటోలను తీయడానికి ఇష్టపడే యూజర్లు మూన్‌ మోడ్‌ ఫిల్టర్లు వాడి చందమామ రంగుల్ని మార్చొచ్చు.

మరిన్ని వార్తలు